Virat Kohli : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటికే పరిమితమైన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆఫ్ ఫీల్డ్ స్కిల్స్ పెంచుకుంటున్నాడు. తన శ్రీమతి, హీరోయిన్ అనుష్క శర్మతో గడిపిన మెమెరబుల్ మూమెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు.
అయితే తాజాగా మయాంక్ అగర్వాల్‌తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు. లాక్డౌన్లో తన భార్య బర్త్ డే సందర్భంగా ఆమె కోసం స్వయంగా ఫస్ట్ టైమ్ కేక్ తయారుచేసినట్లు తెలిపాడు కోహ్లీ. ‘ఈ కేక్ నాకు చాలా బాగా నచ్చింది.. నాకెంతో స్పెషల్’ అని అనుష్క అతడితో చెప్పినట్లు వివరించాడు. ఆ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనది, ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు.
ఇక లాక్ డౌన్ లో ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్, బల్గేరియన్ స్క్వాడ్ వంటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తానని తెలిపాడు. పవర్ స్నాచ్ ఎక్స్‌ర్‌సైజ్ చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
Read More : రైతు కుటుంబానికి ట్రాక్టర్ పంపిన సోనూ..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్