PT Usha: ఇక లాంఛనమే.. అత్యున్నత పదవిని అధిరోహించనున్న పరుగుల రాణి! 95 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ..

ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించి, ఒలింపిక్స్‌లో భారత్‌కు ఐకాన్‌గా నిలిచిన పీటీ ఉష ప్రతిష్ఠాత్మక భారత ఒలింపిక్‌ సంస్థ అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు.

PT Usha: ఇక లాంఛనమే.. అత్యున్నత పదవిని అధిరోహించనున్న పరుగుల రాణి! 95 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ..
Pt Usha
Follow us

|

Updated on: Nov 29, 2022 | 7:58 AM

రేస్ ట్రాక్‌లో భారతదేశానికి లభించిన దిగ్గజ అథ్లెట్ పరుగుల రాణి పీటి ఉష. తన పరుగుతో ఎన్నో అసమాన రికార్డులు ఖాతాలో వేసుకున్న ఆమె మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించి, ఒలింపిక్స్‌లో భారత్‌కు ఐకాన్‌గా నిలిచిన పీటీ ఉష ప్రతిష్ఠాత్మక భారత ఒలింపిక్‌ సంస్థ అధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని పీటీ ఉష ఇంతుకు ముందే ప్రకటించారు. ఇందుకోసం తాజాగా ఈ పదవికి నామినేషన్ దాఖలు చేశారామె. అయితే ఆదివారమే ముగిసిన నామినేషన్ల ప్రక్రియలో ఉష తప్ప మరెవరూ నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. దీంతో పీటీ ఉష ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే. డిసెంబర్ 10న ఆమె నియామకాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే 95 ఏళ్ల భారత ఒలింపిక్ సంస్థ చరిత్రలో ఓ మహిల అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. పీటీ ఉష ఆ తొలి మహిళాగా అరుదైన ఘతను సొంతం చేసుకున్నారు.

పతకం రాకున్నా..

డిసెంబరు 10న జరగనున్న ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు పీటీ ఉష ఒక్కరే అభ్యర్థిగా బరిలోకి దిగగా, ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ పత్రాల సమర్పణ గడువు నవంబర్‌ 27తో ముగిసింది. దీంతో పీటీ ఉష అధ్యక్షురాలిగా నిలవడం ఖాయం. దీంతో క్రీడా సంఘాల్లో అత్యున్నత పదవులు నిర్వహిస్తున్న మాజీ క్రీడాకారుల జాబితాలోకి పీటీ ఉష పేరు కూడా చేరనుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన 58 ఏళ్ల ఉష 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల రేస్‌ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచింది.భారత వెటరన్ రేసర్ పీటీ ఉష అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోగా, మరో 14 మంది వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒలింపిక్ పతక విజేత షూటర్ గగన్ నారంగ్, పయనీర్ యోగేశ్వర్ దత్ వంటి పెద్ద పేర్లు కూడా ఈ అభ్యర్థుల జాబితాలో ఉన్నాయి. భారత ఒలింపిక్ సంస్థ ఎన్నికల అధికారి ఉమేష్ సిన్హా మాట్లాడుతూ శుక్ర, శనివారాల్లో పీటీ ఉష మినహా అధ్యక్ష పదవికి ఎలాంటి నామినేషన్ పత్రాలు సమర్పించలేదని తెలిపారు. అయితే 24 మంది అభ్యర్థులు వివిధ పదవులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

95 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ..

కాగా పీటీ ఉష ఎన్నిక లాంఛనం కావడంతో సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు అభినందనల వర్షం కురుస్తోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ వేదికగా పరుగులరాణికి శుభాకాంక్షలు తెలిపారు… ‘ఐఓఏ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు కంగ్రాట్యులేషన్స్ గోల్డెన్ గర్ల్. అంతేగాక ఆఫీస్ బేరర్లుగా ఎన్నిక కాబోతున్న దేశ క్రీడా హీరోలందరికీ అభినందనలు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది’ అని ట్వీట్ చేశారు.

ఇక ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఇతర అంతర్జాతీయ అథ్లెటిక్ మీట్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక తదితర విధులను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOC) చూసుకుంటుంది. ఇది కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా కూడా పనిచేస్తుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల ఎంపికకు కూడా ఈ సంస్థ బాధ్యత వహిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..