విరాట్-అనుష్క గొడవ పడితే.. ముందుగా సారీ ఎవ‌రు చెప్తారంటే ?

భార‌త కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ భామ‌ అనుష్కశర్మ ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

  • Ram Naramaneni
  • Publish Date - 8:27 pm, Wed, 12 August 20
విరాట్-అనుష్క గొడవ పడితే.. ముందుగా సారీ ఎవ‌రు చెప్తారంటే ?

భార‌త కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ భామ‌ అనుష్కశర్మ ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ‘టేక్‌ ఏ బ్రేక్‌’ పేరుతో త్రి రౌండ్స్ రౌండ్లు పెట్టుకున్న ఈ పోటీలో తమ ప్రొఫిష‌న్స్‌, ఇష్టాలు గురించి ప్రశ్నలు సంధించుకున్నారు.

మొద‌టి రౌండ్లో తమ వృత్తుల గురించి ఒక‌రినొక‌రు ప్రశ్నించుకున్నారు. ఇండియాలో నిర్మించిన ఫ‌స్ట్‌ హిందీ ఫీచర్‌ ఫిల్మ్‌ ఏదని అనుష్క అడగ్గా విరాట్ సైలైంటైపోయాడు. ఏదో ప్ర‌య‌త్నించి ‘మేరా అంజాన్‌’ అని చెప్పాడు. అయితే ‘రాజా హరిశ్చంద్ర’ (1913) క‌రెక్ట్ ఆన్స‌ర్ అని అనుష్క చెప్పింది. ఆ తర్వాత క్రికెట్ థీమ్‌తో వచ్చిన రెండు చిత్రాల‌ పేర్లు అడగ్గానే ‘లగాన్‌’, ‘పటియాలా హౌజ్’ అని వెంట‌నే చెప్పేశాడు విరాట్‌. అయితే క్రికెట్‌లో మూడు ప్రైమ‌ర్ రూల్స్ అడగ్గా.. ‘ఔటవ్వొద్దు’, ‘ఆటను వదిలేయొద్దు’ అని అనుష్క నవ్వుతూ ఆన్స‌రిచ్చింది. ఆ తర్వాత క‌రెక్ట్ ఆన్స‌ర్స్ చెప్పింది. ఇలా ప‌లు ప్ర‌శ్న‌ల అనంతరం వ్యక్తిగతానికి విష‌యాల వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఇద్దరూ గొడపడితే ముందుగా తానే సారి చెబుతానని, ఇద్దరూ పోట్లాడుకుంటే ‘కోహ్లీ’ ఘోరంగా ఓడిపోతాడని అనుష్క చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read : కరోనాతో ప్ర‌ముఖ‌ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి