యాక్షన్ ఎఫెక్ట్.. స్పిన్నర్‌పై ఐసీసీ వేటు..!

యాక్షన్ ఎఫెక్ట్.. స్పిన్నర్‌పై ఐసీసీ వేటు..!

శ్రీలంక స్పిన్నర్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్పిన్నర్ అకిల ధనంజయ‌పై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది. గత నెల ఆగస్టులొ 14-18 తేదీల మధ్య న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అకిల ధనంజయ బౌలింగ్ యాక్షన్‌పై అపెక్స్ క్రికెటింగ్ బాడీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 29న చెన్నైలో నిర్వహించిన బౌలింగ్ పరీక్షకు ధనంజయ హాజరయ్యాడు. అధికారులు సమక్షంలో ధనంజయ బౌలింగ్ వేశాడు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 19, 2019 | 11:59 PM

శ్రీలంక స్పిన్నర్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్పిన్నర్ అకిల ధనంజయ‌పై ఏడాదిపాటు ఐసీసీ నిషేధం విధించింది. గత నెల ఆగస్టులొ 14-18 తేదీల మధ్య న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అకిల ధనంజయ బౌలింగ్ యాక్షన్‌పై అపెక్స్ క్రికెటింగ్ బాడీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 29న చెన్నైలో నిర్వహించిన బౌలింగ్ పరీక్షకు ధనంజయ హాజరయ్యాడు. అధికారులు సమక్షంలో ధనంజయ బౌలింగ్ వేశాడు. బౌలింగ్ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ధనంజయపై 12 నెలల నిషేధం విధిస్తూ తాజాగా ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే అకిల ధనంజయ సస్పెండ్ కావడం ఇదే తొలిసారేమి కాదు.. గతంలో కూడా ఓ సారి ఇలానే నిషేధానికి గురయ్యాడు. 2018 డిసెంబరులో ఓసారి సస్పెన్షన్‌కు గురయ్యాడు. అయితే, ఆ తర్వాత అతడు తన బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. అయితే ఇంతలోనే మరోసారి అనుమానాస్పద బౌలింగ్‌తో మళ్లీ ఐసీసీ నిషేధానికి గురయ్యాడు. కాగా, ఐసీసీ విధించిన 12 నెలల నిషేధం ముగిసిన తర్వాత.. మళ్లీ తన బౌలింగ్ యాక్షన్‌ను మరోసారి పరిశీలించమని ఐసీసీని కోరే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు కూడా మళ్లీ సెలక్ట్ అయ్యి.. కొనసాగుతాడా.. లేక యాక్షన్‌ అలానే వేసి వేటు కొనసాగించుకుంటాడో మరో ఏడాది పాటు వేచి చూస్తే తెలుస్తుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu