రికార్డులు కొల్లగొడుతున్న టీం ఇండియా సారథి

నాగ్‌పూర్‌: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి బ్యాటు పట్టుకుంటే రికార్డుల వేట కొనసాగాల్సిందే. మంగళవారం నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అత్యంత వేగంగా 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్‌గా విరాట్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. నాగ్‌పూర్‌ వన్డేలో 22 పరుగుల వద్ద ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే 9వేల పరుగులు చేయడం గమనార్హం. […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:22 pm, Tue, 5 March 19
రికార్డులు కొల్లగొడుతున్న టీం ఇండియా సారథి

నాగ్‌పూర్‌: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి బ్యాటు పట్టుకుంటే రికార్డుల వేట కొనసాగాల్సిందే. మంగళవారం నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అత్యంత వేగంగా 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్‌గా విరాట్‌ రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. నాగ్‌పూర్‌ వన్డేలో 22 పరుగుల వద్ద ఈ మైలురాయిని చేరుకున్న కోహ్లీ కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే 9వేల పరుగులు చేయడం గమనార్హం. ఇందుకు పాంటింగ్‌ 203 ఇన్నింగ్స్‌లు ఆడాల్సి వచ్చింది. 9వేల పరుగులు చేసిన కెప్టెన్లలో గ్రేమ్‌ స్మిత్‌(220 ఇన్నింగ్స్‌లు) ఎంఎస్‌ధోని (253), అలెన్‌ బోర్డర్‌(257), స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (272) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.