సాహో ప్రి రిలీజ్ ఈవెంట్… ఏర్పాట్లు అదరహో! 

Splendid Arrangements for Saaho Pre Release Event in Ramoji Film City, సాహో ప్రి రిలీజ్ ఈవెంట్… ఏర్పాట్లు అదరహో! 

సాహో ప్రీరిలీజ్ వేడుక కోసం ఏకంగా 2 కోట్ల తో సాహో వరల్డ్ పేరుతో భారీ సెట్లు వేశారు. ఇక్కడ హైటెక్ కార్లు.. బైక్ లు.. ట్యాంకర్ దర్శనమీయనున్నాయి. ఒక స్పెషల్ వోల్ట్ డిస్ ప్లే ట్విస్టివ్వనుందని తెలుస్తోంది. ఫిలింసిటీలో వేదిక ఇప్పటికే పక్కాగా సిద్ధమైంది. వేదికను కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అత్యంత భారీగా సిద్ధం చేశారు. ఇక్కడ గాల్లో సాహో బెలూన్లు నింగిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. వేదిక వద్ద వీవీఐపీ గ్యాలరీలో కుర్చీలు రెడీ అయిపోయాయి. దీనికోసం ఏకంగా భారీ క్రేన్లను ఉపయోగించినట్టు స్పాట్ లో సీన్ చెబుతోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లక్ష మంది వేదిక ముందుకు దూసుకురాబోతున్నారు కాబట్టి వీళ్లను నిలువరించేందుకు భారీగా బారికేడ్లను వేశారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు భారీగానే ఉండనుందని తెలుస్తోంది. నేటి సాయంత్రం 6 దాటితే రామోజీ ఫిలింసిటీ కిటకిటలాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు బయట మబ్బు వాతావరణం ఉన్నా.. చీకటిని చీల్చే వెలుతురు చినుకుల్లా డార్లింగ్ ఫ్యాన్స్ దూసుకొస్తున్నారన్నది తాజా వార్త.

ఎలాంటి  అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. భారీగా ఇనుప చువ్వలతో చుట్టూ సెపరేషన్ చేశారు. ఇక వీవీఐపీ.. వీవీఎంఐపీ.. కామన్ మ్యాన్ గ్యాలరీ.. ఇలా డివైడ్ చేశారు. సాయంత్రం 6 తర్వాత ఈవెంట్ అయినా 3గంటల నుంచే తెలుగు సినిమా మీడియాను రామోజీ ఫిలింసిటీకి వాహనాల్లో తరలిస్తున్నారు. ఫ్యాన్స్ రాక మొదలైనప్పటి నుంచి పోలీసులకు తాకిడి ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఈవెంట్ తర్వాత కొచ్చి.. మైసూర్ ఈవెంట్లు జరగనున్నాయి. దుబాయ్ లో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సాహో ఆగస్టు 30న రిలీజ్ కాబోతోంది.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *