Vastu Tips: బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే, వెంటనే తీసేయండి..!

Vastu Tips: కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. నివాస స్థలం, జీవితం ఆనందమయం..

Vastu Tips: బెడ్‌రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే, వెంటనే తీసేయండి..!
Bed Room Vastu
Follow us

|

Updated on: Jul 27, 2022 | 8:01 AM

Vastu Tips: కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. నివాస స్థలం, జీవితం ఆనందమయం అవటానికి వాస్తు ఉపకరిస్తుంది. అందుకే, ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు. లేదంటే.. సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారని అంటున్నారు వాస్తు నిపుణులు. అయితే, ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశాలలో బెడ్ రూమ్ ఒకటి. అందుకే బెడ్ రూమ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాస్తు ప్రకారం.. బెడ్ రూమ్‌ని డిజైన్ చేయడం ద్వారా మీ ఇంటిని పునరుద్ధరించడమే కాకుండా, జీవితంలోనూ అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వాస్తు ప్రకారం బెడ్‌రూమ్‌ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం సూత్రాల ప్రకారం.. నిద్రించడానికి దక్షిణ దిశ ఉత్తమంగా పరిగణించబడుతుంది. అంటే పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. వాస్తు ప్రకారం.. బెడ్‌రూమ్‌లో బెడ్ ప్లేస్‌మెంట్ చాలా ముఖ్యం. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, నిద్రపై ప్రభావం చూపుతుంది. అతిథి గదిలో మంచం తల పడమర వైపు ఉండాలి. మీ మంచం చెక్కతో చేసినట్లయితే మంచిది. ఇనుము చేసిందయితే.. జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే మెటల్, ఇనుప మంచం మీద పడుకోవద్దు.

గది మూలలో మంచం ఉంచవద్దు..

గది మూలలో బెడ్ ఉంచడం మానుకోండి. ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. వాస్తు ప్రకారం.. బెడ్‌ గోడ మధ్య భాగంలో ఉండాలి. తద్వారా చుట్టూ తిరగడానికి తగినంత స్థలం ఉంటుంది.

గుండ్రటి మంచం వద్దు..

మంచం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాకారంగా, చతురస్రాకారంలో ఉండాలి. గుండ్రంగా, ఓవల్ బెడ్‌లను వినియోగించొద్దు. వాస్తు ప్రకారం, మీ డబుల్ కాటన్ బెడ్‌లో రెండు సింగిల్ పరుపులకు బదులుగా ఒకే పరుపు ఉండేలా చూసుకోండి. అలాగే మంచం చెక్కతో తయారు చేయించుకోవాలి.

ఇవి అస్సలు ఉండొద్దు..

దంపతుల మధ్య సఖ్యతను వాస్తు శాస్త్రం ప్రభావితం చేస్తుంది. దంపతులు రెండు వేర్వేరు పరుపులపై కాకుండా ఒక పరుపుపై పడుకోవాలి. అనందకరమైన బంధం కోస భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపున పడుకోవాలి. అలాగే గదిలో ఒంటరిగా ఉన్న జంతువులు, పక్షులకు సంబంధించిన చిత్రాలను, వస్తువులను అస్సలు ఉంచకూడదు. జంటలను మాత్రమే ఏర్పాటు చేయాలి. వాస్తు ప్రకారం.. బెడ్ రూమ్‌లో యుద్ధం, రాక్షసుడు, గుడ్లగూబ, గద్ద, రాబందు చిత్రాలను ఏర్పాటు చేయొద్దు. వాటికి బదులుగా జింక, హంస, చిలుక ఫోటోలను పెట్టుకొవచ్చు. ఆహ్లాదకరమైన పర్యటనల ఫోటోలు, కుటుంబ పర్యటనల ఫోటోలను గదిలో పెట్టొచ్చు. ఇవి మీకు మంచి సమయాన్ని గుర్తు చేస్తాయి.

ఆ వైపు నిద్రించొద్దు..

పడకగదిలో ఈశాన్య దిశకు ఎదురుగా నిద్రించే జంటకు బిడ్డ పుట్టడంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు దంపతులు ఆగ్నేయ ముఖంగా ఉన్న పడకగదిలో ఉండకూడదని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.