Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప్పావడ సేవా టికెట్లు గలవారికి బ్రేక్ దర్శనం కొనసాగింపు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప్పావడ సేవా టికెట్లు గలవారికి బ్రేక్ దర్శనం కొనసాగింపు
Tirumala Darshanam
Follow us

|

Updated on: May 17, 2022 | 7:27 AM

Tirumala: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) గుడ్ న్యూస్ చెప్పింది. వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని  భక్తుల సౌకర్యార్ధం.. తాత్కలికంగా రద్దు చేసిన తిరుప్పావడ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ సేవా టికెట్లు గలవారు ఆయా తేదీల్లో బ్రేక్ దర్శనానికి రావాలని కోరింది.  అంతేకాదు స్వామివారికి ప్రతి మంగళవారం నిర్వహించే అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవాటికెట్లను జూన్ వరకు ఆన్లైన్ లో విడుదల చేయడంతో భక్తులు బుక్ చేసుకున్నారు. కావున ఆన్లైన్ లో సేవాటికెట్లు బుక్ చేసుకున్న వారిని అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవకు అనుమతించాలని టిటిడి నిర్ణయించింది.

వేస‌విలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని వారి సౌక‌ర్యార్థం జూన్ 30వ తేదీ వ‌ర‌కు అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ సేవ‌ల‌ను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్నట్టు టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అడ్వాన్స్ బుకింగ్ లో జూన్ 30వ తేదీ వరకు తిరుప్పావడ, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌ సేవా టికెట్లు గలవారు శ్రీవారి దర్శనం చేసుకునే వీలుని కల్పించింది. లేనిపక్షంలో సేవాటికెట్ రీఫండ్ పొందాలని కోరడమైనది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Horoscope Today: ఈ రోజు ఓర్పు, సహనంతో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

 రాములోరికి భారత్ బయోటెక్ భారీ విరాళం.. నేరుగా భద్రాద్రి ఆలయ ఖాతాలో జమ..

ఘనంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు.. నేడు కన్నులపండువగా స్వర్ణ రథోత్సవం