Tirupati Laddu Controversy: “తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు వార్త అసహ్యం కలిగించింది”

ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం తగ్గి.. భక్తులే ఆలయ విషయాలు చూసుకునే పరిస్థితి వస్తే తిరుమల లడ్డూ వివాదం వంటి మహాపరాధాలు భవిష్యత్‌లో జరగకుండా అడ్డుకోగలమని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ఆలయ ప్రసాదం కలుషితమైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్దారణ చేసిన తర్వాత సద్గురు ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Tirupati Laddu Controversy: తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు వార్త అసహ్యం కలిగించింది
Sadhguru Jaggi Vasudev
Follow us

|

Updated on: Sep 22, 2024 | 8:26 PM

“తిరుపతి ప్రసాదంలో బీఫ్ టాలో ఉందన్న వార్త అసహ్యాన్ని కలిగించిందని”  ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు చెప్పారు.  హిందూ దేవాలయం భక్తులచే నిర్వహించబడాలి కానీ ప్రభుత్వాల ఆధీనంలో ఉండకూడదన్నారు. ఈ సంఘటన అసహ్యకరమైనదని..  భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో జంతు కొవ్వు కలిసి ఉండడం మహాపరాధంగా పేర్కొన్నారు. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడుకోవడానికి వాటిని భక్తులు ఆధీనంలో ఉంచాలని ఉద్ఘాటించారు.  అందుకే భక్తులే ఆలయాలు నడిపాలని.. ప్రభుత్వాలు గుడులపై తమ పెత్తనాన్ని విడనాడాలని తామంతా కోరేదన్నారు.

వివాదాన్ని ప్రస్తావిస్తూ, సద్గురు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేసారు – “గొడ్డు కొవ్వు కలిసిన ప్రసాదం హిందూ భక్తులు తినేలా చేయడం అసహ్యాన్ని కలిగించేది. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పాలనలో కాకుండా భక్తులచే నడపబడాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులైన హిందువులచే నిర్వహించబడమే మంచిది.” అని ఆయన రాసుకొచ్చారు. 

ప్రఖ్యాత తిరుపతి దేవస్థానంలోని ప్రసాదంలో బీఫ్ టాలో మిళితమైందని వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ఆయన ఈ ట్వీట్ చేశారు.  ఈ అంశంపై  దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నిరసనల మధ్య, హిందూ దేవాలయాల పవిత్రత, సమగ్రతను కాపాడే లక్ష్యంతో ఆలయ నిర్వహణను తిరిగి భక్తులకే ఇవ్వాలన్న డిమాండ్స్ పెరుగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..