Vastu Tips: మీ ఇంట్లో వాస్తుకు సంబంధించి ఈ దోషాలు.. ఆర్ధిక ఇబ్బందులకు కారణం కావచ్చు..

Vastu Tips: చేతిలో డబ్బు లేకపోవడం, ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు లకు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణంగా భావిస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టె కొన్ని వాస్తు తప్పుల గురించి ఈరోజు మీరు తెలుసుకోండి..

Vastu Tips: మీ ఇంట్లో వాస్తుకు సంబంధించి ఈ దోషాలు.. ఆర్ధిక ఇబ్బందులకు కారణం కావచ్చు..
Vastu Tips
Follow us

|

Updated on: Jun 05, 2022 | 9:16 PM

Vastu Tips: ప్రతి వ్యక్తి జీవితంలో తాను అభివృద్ధి బాటలో పయనించాలని ప్రయత్నిస్తాడు. తద్వారా సుఖసంతోషాలను పొందుతాడు. అంతేకాదు అతను కష్టపడి తన కుటుంబ సభ్యుల కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాడు. ఇంట్లో,  జీవితంలో మంచి వాతావరణం ఏర్పడడానికి మన చుట్టూ సానుకూల శక్తిని కలిగి ఉండటం అవసరం. కొన్నిసార్లు ప్రతికూలత వ్యక్తి ఇంట్లో ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు ప్రకారం (vastu tips for home), ఈ పరిస్థితిలో ఇంట్లో దోషాలు ఉండవచ్చు. ఇలాంటి లోపాల కారణంగా, శారీరక , ఆర్థిక సమస్యలు జీవితంలో కలుగుతాయి. ప్రజలు తరచుగా ఇంటికి సంబంధించిన కొన్ని తప్పులు చేస్తారు. వీటి ప్రభావం ఆర్థికంగా చూపించవచ్చు. చేతిలో డబ్బు లేకపోవడం, ఆకస్మిక ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు లకు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణంగా భావిస్తారు.  మీ ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టె కొన్ని వాస్తు తప్పుల గురించి ఈరోజు మీరు తెలుసుకోండి..

కుళాయి నుంచి నిత్యం నీరు కారుతుంటే..  వాస్తు ప్రకారం.. ఇంట్లో ఉన్న కుళాయి నుండి నీరు నిరంతరంగా కారుతుంటే..  ఆర్థిక సంక్షోభాన్ని కలిగిస్తుంది. నీరు వృథాగా ఖర్చు చేసేవారి పై లక్ష్మీదేవి ఆగ్రహం చూపిస్తుందని నమ్మకం. కనుక మీ ఇంట్లో అలాంటి సమస్య ఉంటే, వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి.

పావురం గూడు పావురం గూడు చాలా ఇళ్లలో కనిపిస్తుంది. నిజానికి ఇది వాస్తు దోషం అని చెబుతారు. చాలా సార్లు ప్రజలు పావురం గూడును తమ ఇళ్లలోని ఏసీలో ఏర్పటు చేసుకుంటున్నా పట్టించుకోరు. అయితే ఇలా చేయడం వల్ల పావురానికి మేలు జరిగినా,ఆ ఇంట్లో దరిద్రం ఏర్పడుతుంది. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఎవరి ఇంట్లోనైనా పావురం గూడు కనిపిస్తే.. వెంటనే తొలగించండి.

ఇవి కూడా చదవండి

నిరంతరం నీటి ప్రవహించే ఇంట్లో లక్ష్మిదేవి..  ఎవరి ఇల్లు.. నిత్యం తడిగా ఉంటుంది.. ఆ ఇంట్లో లక్ష్మి దేవి నివాసం ఉండదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఇలాంటి పొరపాటు వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంట్లోని సభ్యులపై ఉందని నమ్మకం. తేమ వలన ఇంట్లో నీరు ఎలా ప్రవహిస్తుందో.. అదే విధంగా డబ్బు కూడా ఇంటి నుంచి వెళ్తూ.. నష్టం వాటిల్లుతుందని పెద్దలు చెబుతుంటారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని  ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..