Zodiac Signs: ఈ రాశుల వారికి పెళ్లి ఆలోచనంటే చాలా ఇష్టం.. అయితే కండీషన్స్ అప్లై అంటారట!.. మరి అవేంటో తెలుసుకుందాం..

Zodiac Signs: ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లి గురించి ప్రస్తావన వస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంటారు. 30 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా పెళ్లేంటి? అంటూ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు.

Zodiac Signs: ఈ రాశుల వారికి పెళ్లి ఆలోచనంటే చాలా ఇష్టం.. అయితే కండీషన్స్ అప్లై అంటారట!.. మరి అవేంటో తెలుసుకుందాం..
Zodiac Signs2
Follow us

|

Updated on: Nov 28, 2021 | 6:36 AM

Zodiac Signs: ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లి గురించి ప్రస్తావన వస్తే చాలు చిర్రుబుర్రులాడుతుంటారు. 30 ఏళ్ల వయసు వచ్చినా.. ఇంకా పెళ్లేంటి? అంటూ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు. లైఫ్‌లో ఏదో సాధించాలన్న తపనలో పడి.. పెళ్లి గురించి ఆలోచించడమే మర్చిపోతున్నారు. పెళ్లి చేసుకుంటే.. ఏం చేయలేమని భావన కారణంగానే వారు ఇలా ఆలోచిస్తుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే, కొంతరు మాత్రం పెళ్లి అనే ఆలోచనను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తమ జీవిత భాగస్వామి, చాలా ప్రత్యేకంగా ఉండాలని, లైఫ్ మరింత ఆనందంగా ఉండాలని కలలు కంటుంటారు. తమను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి తమ జీవిత భాగస్వామిగా రావాలని ఆశిస్తుంటారు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 5 రాశులకు చెందిన వారు పెళ్లి అనే ఆలోచనను బాగా ఇష్టపడుతారట. మరి ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వృషభం.. వృషభ రాశి వారికి పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. సురక్షితమైన, ప్రేమను పంచే బంధం కోసం వెతుకుతుంటారు. అయితే, అస్థిరమైన, అర్థంలేని సంబంధాలతో సమయాన్ని వృథా చేసుకోరు.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వ్యక్తులు తమ జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. వారు హుక్‌అప్‌లు, డేటింగ్ కల్చర్‌ని ఏమాత్రం ఇష్టపడరు. వివాహంతో ఎండ్ అయ్యే సంబంధాలనే వారు కోరుకుంటారు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపగలిగే అంకితభావం, నిబద్ధత కలిగిన భాగస్వామిని కోరుకుంటారు.

తులారాశి.. తుల రాశి వ్యక్తులు వివాహం విషయంలో రాజీ పడరు. తాము ఏదో ఒక రోజు వివాహం చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే, తక్కువ స్థాయి వారితో స్థిరపడరు. వారి ప్రమాణాలకు సరిపోయే వారితో మాత్రమే జతకడుతారు. తమ స్థాయికి తగ్గట్లు వారిని మాత్రమే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు.

వృశ్చికరాశి.. వృశ్చిక రాశి వ్యక్తులు రిలేషన్‌షిప్‌కి పూర్తిగా టైమ్ కేటాయించడానికి ఆసక్తి చూపుతారు. అయితే, ఎదుటి వారిపై నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే వారితో మాట్లాడటం గానీ, సంబంధాన్ని కొనసాగించడం గానీ చేస్తుంటారు.

మకరరాశి.. ఈ రాశి వారి ప్రతిష్టాత్మకంగా, లక్ష్యం ఆధారితంగా ఉంటారు. అయితే, వీరు వివాహ ఆలోచనను విశ్వసిండంతో పాటు, ఆసక్తి చూపుతారు కూడా. అయితే, వారు తమ భాగస్వాములు తమలాగే స్వతంత్రంగా, వ్యక్తిగతాని గౌరవమిస్తూ.. తమ కోరికలు, ఆశయాలను గౌరవించే వ్యక్తిని కోరుకుంటారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!