These 4 Zodiac Women : ఈ 4 రాశుల మహిళలు ఉత్తమ తల్లులు.. మీరు ఇందులో ఉన్నారా..?

These 4 Zodiac Women : ఈ 4 రాశుల మహిళలు ఉత్తమ తల్లులు.. మీరు ఇందులో ఉన్నారా..?
Zodiac

These 4 Zodiac Women : ఈ లోకంలోఅమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు

uppula Raju

| Edited By: Phani CH

Jul 07, 2021 | 9:26 AM

These 4 Zodiac Women : ఈ లోకంలోఅమ్మను మించిన దైవం లేదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎవ్వరికైనా అమ్మే తొలి గురువు. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే నడకను, ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది. ఏ చిన్న తప్పుచేసినా కడుపులో దాచుకుని కనికరిస్తుంది. అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం.

ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. అందుకే అమ్మ ప‌ట్ల మ‌న‌కు ఉన్న ప్రేమ‌ను చాటుకోవ‌డానికి ఇంతక‌న్నా మంచి త‌రుణం ఇంకోటి ఉండ‌దు. అయితే ప్రపంచంలో ఈ నాలుగు రాశుల మహిళలు ఉత్తమ తల్లులుగా గుర్తింపు పొందారు. వారు ఏ రాశులవారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కర్కాటక రాశి కర్కాటక రాశి మహిళలు సున్నితమైన స్వభావానికి చెందినవారు. పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తారు. నిత్యం శ్రద్ధతో వారిని గమనిస్తారు. వారికి రక్షణగా ఉంటారు. పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు.

2. సింహరాశి సింహరాశికి చెందిన తల్లులు చాలా నమ్మకంగా ఉంటారు. ఇంకా ఉదారంగా వ్యవహరిస్తారు. తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో వీరికి ఎవరు సాటిరారు. పిల్లలను ఇబ్బందుల నుంచి కాపాడటానికి ఎంతదూరమైన వెళుతారు.

3. కన్యరాశి కన్యరాశి తల్లులు పరిపూర్ణవాదులు. వీరి ప్రతీది ప్లాన్ చేసి చేస్తారు. ఏ పనైనా ఒక క్రమ పద్దతిలో చేయడానికి ఇష్టపడతారు. మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఎలాంటి పనులైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. ప్రతిదీ ఖచ్చితంగా నిర్ధారించుకుంటారు. తన పిల్లలకు క్రమశిక్షణ, మంచి చెడుల గురించి చెబుతారు. ఇది ఏ బిడ్డకైనా అత్యంత విలువైన పాఠం.

4. మీన రాశి మీన రాశి తల్లులు ప్రశాంతంగా, సున్నితంగా, దయతో ఉంటారు. పిల్లలతో సరైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వారికి చాలా సహాయకారిగా ఉంటారు. పిల్లల కోసం ఏదైనా చేస్తారు. వారి కలలను సాధించడానికి నిత్యం ప్రేరేపిస్తారు.

Bengal Legislative Assembly: మమతా బెనర్జీ కొత్త స్కెచ్.. మండలి ఏర్పాటు తీర్మానానికి శాసనసభ ఆమోదం

CM JAGAN: వైఎస్ జగన్ రెండ్రోజుల పాటు జిల్లాల పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

India vs Sri Lanka: జీరో నుంచి మొదలుపెడతా.. ఐపీఎల్ లో ఆడినట్లే.. లంకలోనూ రిపీట్ చేస్తా: టీమిండియా యంగ్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu