PM Modi: కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి రద్దీ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.. పుణ్యస్నానం ఆచరించనున్నారు.

PM Modi: కుంభమేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం..
Pm Modi
Follow us
K Sammaiah

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 04, 2025 | 7:36 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వసంత పంచమి రద్దీ ఇంకా కొనసాగుతోంది. అయితే.. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్నారు.. బుధవారం (ఫిబ్రవరి 5న) ప్రధాని మోదీ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.

బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు. ఘాట్‌ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి వెళతారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల మధ్య త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించనున్నారు.  11.45 గంటలకు బోటులో తిరిగి అరైల్‌ ఘాట్‌కు చేరుకుని, అక్కడి నుంచి ప్రయాగ్‌రాజ్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి న్యూఢిల్లీ చేరనున్నారు.

ప్రయాగ్‌రాజ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని ఎలాంటి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదు. కేవలం పుణ్యస్నానం ఆచరించి గంగానదికి పూజలు చేసి తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు మోదీ ప్రయాగ్‌రాజ్‌లో గడపనున్నారు. ఈ క్రమంలోనే నగరంతో పాటు కుంభమేళా వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు. రూ.5500 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కాగా, ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగుతుంది.