లంకేషుడిపై ఊరేగిన శ్రీశైలేషుడు… వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఐదో రోజు ఆలయంలో..

  • Sanjay Kasula
  • Publish Date - 1:07 am, Tue, 9 March 21
లంకేషుడిపై ఊరేగిన శ్రీశైలేషుడు... వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
srishaila mallikarjuna swamy

Srishaila Mallikarjuna Swamy: దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు  అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఐదో రోజు ఆలయంలో పూజాధి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకస్వాములు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం చండీహోమం జరిపించారు.

సోమవారం సాయంత్రం కాలార్చనలు, హోమాలు జరిపించారు. అనంతరం శ్రీభ్రమరాంబా దేవి సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శమిచ్చారు. తొలుత భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపానికి తీసుకువచ్చారు. మంగళవాయిద్యాల నడుమ క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, శివసత్తుల విన్యాసాల ఊరేగింపులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి.

ఈ సందర్భంగా దేవతామూర్తులకు ప్రత్యేక హారతలిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణలు చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మిరుమిట్లు గొలిపే దీపకాంతులతో ఆలయ ప్రాంగణం కనువిందు చేసింది.

రావణ వాహనాధీశుడిని దర్శించుకున్న వారికి కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని ప్రధాన అర్చకుడు భద్రయ్య వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఈ ఓ కేఎస్ రామారావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

Women’s day 2021 : క్రీడా రంగంలోనూ ‘ఆమే’ మహా రాణి.. అంతర్జాతీయ యవ్వనికపై భారత జెండాను రెపరెపలాడిస్తూ మహిళా రాణులు వీరే..

Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..

Graduate MLC Elections: తెలంగాణలో హీట్ పెంచిన ఎమ్మెల్సీ ఎన్నికలు.. మహిళా దినోత్సవం రోజున ‘గాజు’లతో ఓటర్లకు గాలం!