Rudraksha: మర్చిపోయి కూడా రుద్రాక్షను ఆ సమయంలో ధరించొద్దు.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రమే..

Rudraksha: పరమ శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. ఆయనకు జలాభిషేకంతో పాటు.. రుద్రాభిషేకం కూడా చేస్తారు.

Rudraksha: మర్చిపోయి కూడా రుద్రాక్షను ఆ సమయంలో ధరించొద్దు.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రమే..
Rudhraksha
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 10, 2022 | 6:28 PM

Rudraksha: పరమ శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. ఆయనకు జలాభిషేకంతో పాటు.. రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఆ సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను వేద పండితలు పఠిస్తారు. అయితే, శివ మంత్రాన్ని జపించడంలో రుద్రాక్ష మాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మంలో రుద్రాక్షను చాలా పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్ష ఆది మహా శివుడిలో అంతర్భాగంగా పరిగణిస్తారు. హిందూమత గ్రంధాలలో రుద్రాక్షను ధరించడం, మంత్రాల పఠనంలో ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా పేర్కొనడం జరిగింది.

రుద్రాక్ష ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జాతకంలో అశుభ గ్రహాల ప్రభావాలను శాంతింపజేయడానికి రుద్రాక్ష కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, రుద్రాక్షను ధరించేవారు కొన్ని నియమాలను తప్పక పాటించాల్సి ఉంటుందని అనేక దైవ సంబంధిత గ్రంధాల్లో పేర్కొనడం జరిగింది. లేదంటే.. దాని పర్యావసానం చూడాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా ఉన్నాయి. రుద్రాక్ష ఎవరు వేసుకోకూడదు? ఏ సమయంలో ధరించకూడదు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. నిద్రించేటప్పుడు రుద్రాక్షను ధరించొద్దు.. శాస్త్రాల ప్రకారం, నిద్రించే సమయంలో రుద్రాక్షను ధరించొద్దు. పడుకునే ముందు మెడ నుండి రుద్రాక్షను తీసి మీ తల వద్ద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెడు కలలు రావు. నిద్రపోయే సమయంలో శరీరంలో కొన్ని మలినాలు వస్తాయట. ఇది రుద్రాక్ష స్వచ్ఛతను ప్రభావితం చేస్తుందని, అందుకే నిద్రించే సమయంలో రుద్రాక్షను ధరించొద్దని చెబుతున్నారు పండితులు.

2. శవయాత్రలో రుద్రాక్ష ధరించొద్దు.. ఎవరైనా చనిపోతే, వారి అంత్యక్రియలకు వెళితే, రుద్రాక్షను తీసివేయాలి. శ్మశాన వాటికలో అంత్యక్రియల సమయంలో రుద్రాక్షను ధరించడం నిషిద్ధం. అలా చేస్తే రుద్రాక్ష అపవిత్రం అవుతుంది. జీవితంలో కష్టాలు మొదలవుతాయి.

3. బిడ్డ పుట్టినప్పుడు రుద్రాక్షను ధరించొద్దు.. హిందూ మతంలో బిడ్డ పుట్టినప్పుడు అంటు ఉంటుందని అంటారు. శిశువు పుట్టిన కొన్ని రోజుల వరకు అపరిశుభ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో పుట్టిన తరువాత శిశువు, తల్లి ఉన్న గదిలో రుద్రాక్ష ధరించడం మానుకోవాలని పేర్కొనడం జరిగింది.

4. మాంసం, మద్యం సేవించే సమయంలో రుద్రాక్షను ధరించొద్దు.. రుద్రాక్షను శివుని ప్రతిరూపంగా భావిస్తారు. దాని స్వచ్ఛతను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మాంసాహారులైతే, మాంసం, మద్యం సేవించేటపుడు రుద్రాక్షను ధరించొద్దు. దీని కారణంగా రుద్రాక్ష స్వచ్ఛత చెదిరిపోతుంది. వ్యతిరేక ఫలితాలు వస్తాయి.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..