Friday Effects: శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే అంతే సంగతులు..

Friday Effects: శుక్రవారం మాతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి తొలి నుంచి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Friday Effects: శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేదంటే అంతే సంగతులు..
Laxmi Devi
Follow us

|

Updated on: Nov 19, 2021 | 6:09 PM

Friday Effects: శుక్రవారం మాతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి తొలి నుంచి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం నాడు లక్ష్మీ దేవిని పూజించి, లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ రోజున ఏదైనా శుభ కార్యాన్ని తలపెట్టినా మంచి జరుగుతుంది. శుక్రవారం నాడు అమ్మవారిని నిష్టతో పూజిస్తే ఆ ఇంట్లో అమ్మవారు కొలువుదీరుతుంది. శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటు, పొరపాటున ఎవరూ చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవి అశుభమైనవిగా పరిగణించడం జరిగింది. శుక్రవారం రోజున ఆ పనులు చేస్తే అమ్మవారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవడం ఖాయం. మరి శుక్రవారం రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి నుండి విగ్రహాన్ని తీసేయొద్దు.. శుక్రవారం మాతా లక్ష్మి దేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు. అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు. ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నాడు అస్సలు నిమజ్జనం చేయకూడదు. అది చెడు శకునము. ఎందుకంటే.. విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీడ్కోలు పలుకడమే. అందుకే శుక్రవారం రోజున ఇంట్లోంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి. వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి. కానీ ఇంట్లోని మరే ఇతర విగ్రహాన్ని తీయొద్దు. అలా చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. తద్వారా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

తలుపు తెరిచి ఉంచాలి.. సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారా తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాలలో పేర్కొనడం జరిగింది. సాయంత్రం వేళ లక్ష్మీ దేవి ఇళ్ళకు వెళ్తుందని, ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మ వారు బయటికి వెళ్లిపోతుంది. అందుకే.. అందుకే సాయంత్రం ఇంటి ప్రధాన తలుపులు తెరవాలని చెబుతారు. పూజా మందిరంలో దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

అప్పు ఎవరికీ ఇవ్వొద్దు.. శుక్రవారం రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుంచి అప్పు తీసుకోకూడదు. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది. శుక్రవారం ఎవరైనా రుణం అడిగితే వారికి సహాయం చేయండి కానీ, అప్పుగా మాత్రం ఇవ్వకండి. ఆ రోజు రుణాలు ఇవ్వడం మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది.

అమ్మాయిలను కొట్టొద్దు.. శుక్రవారం నాడు కొంతమంది లక్ష్మీ దేవి ఉపవాసం పాటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటున కూడా అమ్మాయిలను అవమానించకూడదు. బదులుగా, మీకు వీలైనంత వరకు వారిని గౌరవించండి. అంతే కాకుండా శుక్రవారం రోజున ఇంటి లక్ష్మిని అంటే ఇంట్లోని స్త్రీలను దూషించకూండా ఉండండి.

ఎవరికీ విగ్రహాన్ని ఇవ్వొద్దు.. శుక్రవారం నాడు ఎవరికీ లక్ష్మిదేవి విగ్రహాన్ని ఇవ్వకూడదు. అలా చేస్తే స్వయంకృతాపరాధం చేసినట్లే అవుతుంది. శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీ దేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు, కానీ ఇతరులకు ఎవరికీ ఇవ్వకూడదు.

Also read:

Lockdown News: విజృంభిస్తున్న కరోనా కొత్త వేవ్.. ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్

AB De Villiers Retires: ఐపీఎల్‌లో పరుగుల వర్షం కురిపించిన ఏబీ డివిలియర్స్.. టాప్ 5 ఇన్నింగ్స్‌‌లో 3 సెంచరీలు

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..