అండాళ్లమ్మ భక్తికి మెచ్చి రంగనాథుడు దిగివచ్చిన పవిత్రమాసం ధనుర్మాసం.. తెలుగు లోగిళ్లన్నీ పండుగవాతావరణాన్ని సంతరించుకునే మాసం …

ధనుర్మాసం వచ్చేసింది... పల్లెటూళ్లలో సందడి మొదలైంది... వేకువ జామునే ఇంటి ముంగిట ముగ్గులు వెలుస్తున్నాయి... ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలు కొలువవుతున్నాయి..

అండాళ్లమ్మ భక్తికి మెచ్చి రంగనాథుడు దిగివచ్చిన పవిత్రమాసం ధనుర్మాసం.. తెలుగు లోగిళ్లన్నీ పండుగవాతావరణాన్ని సంతరించుకునే మాసం ...
Balu

|

Dec 16, 2020 | 8:59 AM

ధనుర్మాసం వచ్చేసింది… పల్లెటూళ్లలో సందడి మొదలైంది… వేకువ జామునే ఇంటి ముంగిట ముగ్గులు వెలుస్తున్నాయి… ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలు కొలువవుతున్నాయి.. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ధనుర్మాసమంతా విష్ణు పారాయణాలతో దేవాలయాలు మారుమోగుతాయి..మార్గశిరం …ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది… మాసాలలో మార్గశిరాన్ని నేనే అని విష్ణుమూర్తి స్వయంగా చెప్పుకున్నారంటే ఈ మాసానికి వున్న వైశిష్టతేమిటో అర్థమవుతుంది… సూర్య గమనాన్ని బట్టి సంవత్సరానికి పన్నెండు నెలలుగా కాల నిర్ధారణ జరిగింది… పన్నెండు నెలలూ పన్నెండు రాశులలో సూర్యుడు ప్రవేశిస్తాడు.. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ ప్రవేశ దినం ఆ రాశిపేరున్న సంక్రమణంగా పిలుస్తారు.. ఈ క్రమంలోనే ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును ధనుస్సంక్రమణంగా పిలుచుకుంటున్నాం.. ఈ రోజు మొదలు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజు అంటే మకర సంక్రాంతి వరకు ధనుర్మాసంగా ప్రసిద్ధి పొందింది… ఈ నెల రోజులు పల్లెలన్నీ కళకళలాడతాయి.. థనుర్మాసం ఆరంభాన్ని పల్లెటూళ్లలో సంక్రాంతి నెల పట్టడం అంటారు.. ఈ మాసం రోజులూ హరిదాసుల కీర్తనలతో… జంగమదేవరలతో.. గంగిరెద్దులను ఆడించేవారితో సందడిగా వుంటుంది… ఇంటి ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు కనువిందు చేస్తాయి.. ధాన్యపు రాశులను ఇళ్లకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూస్తుంటాయి..

ధనుర్మాస ప్రాశస్త్యాన్ని బ్రహ్మదేవుడు నారద మహర్శికి వివరించినట్టు బ్రహ్మాండ పురాణం చెబుతోంది.ధనూరాశికి బృహస్పతి అధిపతి… బృహస్పతి అంటే బుద్ధిని వికసింపచేసేవాడు.. జ్ఞానవంతుడు… సంపత్కారకుడు.. కాబట్టి ధనుర్మాసవ్రతం చేసేవారు బుద్ధి వికారం పొందుతారని.. జ్ఞానవంతులు.. ఐశ్వర్యవంతులూ అవుతారని పురాణాలు చెబుతున్నాయి… ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అంటాను.. కాబట్టి దీనికి మధుసూదన వ్రతమని పేరు.. తమ శక్తి కొద్ది బంగారం.. వెండి… రాగి… చివరకు మట్టితోగాని విష్ణువు విగ్రహాన్ని చేయించి పూజా మందిరంలో ప్రతిష్టిస్తారు.. బ్రాహ్మీ ముహూర్త కాలంలో నిద్రలేని … స్నానాదికాలు ముగించుకుని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకుని… ఆ తర్వాత మధుసూదన మూర్తిని పంచామృతాలు.. కొబ్బరి నీరు… పాలు.. సుగంధద్రవ్యాలతో స్నానం చేయిస్తారు..

విష్ణువు అలంకార ప్రియుడు..ఆయనకు తులసిదళాలంటే అమితమైన ప్రీతి.. పసుపురంగంటే మహాఇష్టం.. కాబట్టి పచ్చటి పూలతోనూ.. తులసిదళాలతోనూ ఆయన్ను అర్చిస్తారు.. అలంకరిస్తారు.. విష్ణునామాన్ని గానం చేస్తారు.. నగర సంకీర్తన చేస్తారు.. నగర సంకీర్తన చేయడం వల్ల స్వచ్చమైన గాలి పీల్చుకునే అవకాశం కలుగుతుంది.. గానం చేయడం వల్ల గొంతులోని నరాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమంగా వుంటుంది..విష్ణు ఆలయాల్లో రకరకాల ప్రసాదాలను తయారు చేస్తారు. చక్కెర పొంగలి.. దద్దోజనం అయితే తప్పనిసరిగా వుంటాయి.. పులగం.. కట్టు పొంగలి.. పులిహోరలను కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.. ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు.. థనుర్మాసం హేమంత రుతువులో వస్తుంది.. మంచు కురిసే వేళ ఇది! గడగడలాడించే చలి… వాతావరణమంతా ఆహ్లాదంగా మారుతుంది.. వాత.. కఫ… పైత్య… శ్లేష్మ దోషాలు… పడిశం ..తేలిక జ్వరం వంటి అనారోగ్యాలు కలుగుతాయి.. పై ప్రసాదాల్లో వాడే నేయి..మిరియాలు.. పెరుగు… పసుపు …పచ్చ కర్పూరం ..ఇతర రస వర్గాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి వున్నవే.. వీటిని ప్రసాదంతో స్వీకరించడం వల్ల అనారోగ్యదోషాలు తొలగుతాయి.. ఉత్సాహం.. ఉత్తేజం కలుగుతాయి..ధనుర్మాసానికి రంగవల్లికలకు ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి,… ఇంటి ముంగిట తీర్చి దిద్దిన ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరిస్తారు.. గొబ్బెమ్మను గుమ్మడి…బంతి… చేమంతి.. ముళ్ల గోరింట మొదలైన పువ్వులతో అలంకరిస్తారు.. ఇలా చేయడం వల్ల లక్ష్మీనారాయణులిద్దరి కటాక్షము లభిస్తుంది… ఆవు పేడ క్రిమిసంహారిణి.. భూసారాన్ని ఇనుమడింపచేయడానికి కూడా దోహదపడుతుంది.. సౌరశక్తిని గ్రహించి ప్రతిఫలించే శక్తి ఆవు పేడకుంది.. సూర్య కిరణాలు తాకగానే గొబ్బెమ్మల నుంచి వాయువులు విడుదలై వాతావరణాన్ని స్వచ్ఛపరుస్తాయి.. ధనుర్మాసమూ.. సంక్రాంతి సూర్య భగవానుడికి సంబంధించిన పండుగలు.. అందుకే ఎక్కువగా రథం.. అష్టదళ పద్మం.. స్వస్తిక్‌.. గుమ్మడి పండు వంటి ముగ్గులు వేస్తారు.. ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి.. ఇదీ ధనుర్మాసం వైశిష్టత..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu