Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు 19వ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 19వ పాశురం. విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై.. తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఆ మహా విష్ణువును కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడంలో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధములో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. విష్ణువు అవతారాలను పొగుడుతుంది. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తరువాతి పది పాశురాల్లో, గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. ఆ తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి, ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల్ని సమ్మతింపజేసి, గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ, బలరామ కృష్ణులను మేల్కొలపమంటూ వారిని వేడుకుంటారు. తరువాత వారు కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన నీళాదేవిని దర్శించి, ప్రార్థిస్తారు. ఈరోజు ధనుర్మాసంలో 19వ రోజు ..ఈరోజు పాశురము, దాని అర్ధం తెలుసుకుందాం..
19వ పాశురం:
కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి, కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్ వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్ మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్ ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్ తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్
అర్ధం: గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే – ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు! క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్లో చుక్కలు చూపిస్తున్న ధర..
Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..