Chanakya Niti: జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే.. ఈ మూడు రకాల వ్యక్తులను వేదించవద్దంటున్న చాణక్య..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)తన జీవితంలో ఎదురైన అనుభవాలతో చెప్పిన ప్రతి ఒక్క విషయం నేడు నిజమని రుజువవుతోంది. ఆచార్య తన నీతి శాస్త్రం(Niti Sastra)లో ప్రతి విషయాన్ని..

Chanakya Niti: జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే.. ఈ మూడు రకాల వ్యక్తులను వేదించవద్దంటున్న చాణక్య..
Chanakya
Follow us

|

Updated on: Feb 10, 2022 | 7:55 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)తన జీవితంలో ఎదురైన అనుభవాలతో చెప్పిన ప్రతి ఒక్క విషయం నేడు నిజమని రుజువవుతోంది. ఆచార్య తన నీతి శాస్త్రం(Niti Sastra)లో ప్రతి విషయాన్ని ప్రస్తావించారు. మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. జీవితంలోని ప్రతి అంశంలోనూ మనిషికి ఆచరణాత్మక విద్యను అందించడం చానుక్యుడి ఉద్దేశ్యం. చాణక్య నీతిని బాగా చదివి, అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. ఆచార్య చాణుక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా పిల్లలకు, పెద్దలకు , పెద్దలకు ఏదో ఒక పాఠాన్ని అందించాడు. కొంతమంది వ్యక్తులతో మనిషి ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించకూడదని .. అలా వారితో తప్పుగా నడుచుకుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం ఆ వ్యక్తి మీద ఉండదని చెప్పాడు చాణుక్యుడు

అహంభావంతో, అహంకారంతో ఉండే వ్యక్తులు, తమకంటే బలహీనమైన వ్యక్తిత్వం ఉన్నవారిని వేధించడం ప్రారంభిస్తారు, అయితే ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం, మంచి స్థానం ఉన్నవారు, తమ కంటే బలహీనులను పొరపాటున కూడా వేధించ వద్దని సూచించాడు. ఆపదలో ఉన్నవారిని మీరు మరింత అసంతృప్తికి గురిచేస్తే..అలాంటి వ్యక్తిపై లక్ష్మి దేవి కోపగించుకుంటుంది.

స్త్రీలను గౌరవించండి సనాతన ధర్మంలో స్త్రీలను దేవతలా పూజిస్తారు. స్త్రీలకు అత్యంత విశిష్ట స్థానం ఉంది కనుక.. ఎవరైనా సరే స్త్రీలను గౌరవించాలి. స్త్రీని ఎప్పుడూ అగౌరవపరచవద్దు లేదా తప్పుగా ప్రవర్తించవద్దు. స్త్రీలను గౌరవించని వ్యక్తులపై లక్ష్మీ దేవిపై కోపం తెచ్చుకుంటుంది. వారి ఇంట్లో పేదరికం ఉంటుంది.

కష్టపడి పనిచేసేవారిని గౌరవించండి చాణక్యుడి నీతి ప్రకారం, కష్టపడి పనిచేసే వారిని గౌరవించని వ్యక్తులపై లక్ష్మి దేవి అనుగ్రహం కలగదు. కనుక ప్రజలు తమ వద్ద సంపద ఉన్నప్పటికీ, కష్టపడి పనిచేసే వారిని మరచిపోకూడదని లేదా అగౌరవపరచకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలాగే కష్టపడి పనిచేసే వ్యక్తిని ఎప్పుడైనా గౌరవించి ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. మీరు కష్టపడి పనిచేసేవారిని నిర్లక్ష్యం చేస్తే.. లక్ష్మి కటాక్షానికి దూరమైనట్లే.. కనుక ఈ ముగ్గురుని గౌరవించే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం, విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Read Also:

ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..