Chanakya Niti: పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. ఇటువంటి 4 లక్షణాలున్న అమ్మాయి బెస్ట్ ఎంపిక అంటున్న చాణక్య

Chanakya Niti: పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.. ఇటువంటి 4 లక్షణాలున్న అమ్మాయి బెస్ట్ ఎంపిక అంటున్న చాణక్య
Chanakya Niti

మీరుకనుక  వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు, ఖచ్చితంగా 4 లక్షణాలను పరీక్షించండి.. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆచార్య చాణక్యుడు ప్రస్తావించిన ఆ నాలుగు లక్షణాలను గుర్తుంచుకోండి.. 

Surya Kala

|

May 12, 2022 | 7:34 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహకర్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త , ఆర్థికవేత్త. అతను జీవితంలోని అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా, తన సామర్థ్యాలను ఉపయోగించి ప్రజలకు అవగాహన కలిగేలా అనేక పుస్తకాలను రాశాడు. వాటిల్లో ఒకటి నీతి శాస్త్రం. ఇందులో చాణుక్యుడు చెప్పిన విషయాలను నేటికి అనుసరణీయమని పెద్దలు చెబుతుంటారు.

మంచి జీవిత భాగస్వామి దొరికితే జీవితమంతా మారిపోతుందని అంటారు. కనుక సరైన జీవిత భాగస్వామి కనుక జీవితంలో లభించకపోతే.. ఆ వ్యక్తి జీవితం అస్తవ్యస్తం. అందువల్ల, పెళ్లి చేసుకునేటప్పుడు.. ముందుగా జీవిత భాగస్వామిగా చేసుకునే వారి గురించి.. వారి ఆలోచన, నడవడిక, వైఖరి గురించి.. ఆచారాల కంటే ఎక్కువ శ్రద్ధ వహించాలని చాణుక్యుడు చెప్పారు. తద్వారా మీ వైవాహిక జీవితం అతనితో సంతోషంగా ఉంటుందని తెలిపారు. మీరుకనుక  వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే, మీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు, ఖచ్చితంగా 4 లక్షణాలను పరీక్షించండి.. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆచార్య చాణక్యుడు ప్రస్తావించిన ఆ నాలుగు లక్షణాలను గుర్తుంచుకోండి..  మీరు వైవాహిక జీవితాన్ని సుఖ సంతోషాలతో గడుపుతారు.

సహనానికి పరీక్ష:  జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి సహనం చాలా ముఖ్యం. జీవితంలో ఓపికగా ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి ఎలాంటి పరిస్థితినైనా ఈజీగా ఎదుర్కుంటారు. కష్టాల్లో కూడా ప్రతి ఒక్కరినీ నడిపించే నైపుణ్యం ఓపిక ఉన్న యువతిని వివాహం చేసుకోవడం అదృష్టం. అలాంటి సహనం కలిగిన అమ్మాయి వివాహం తర్వాత మీకు  మంచి జీవిత భాగస్వామిగా మారవచ్చు. అందుకే ఎవరినైనా జీవిత భాగస్వామిగా ఎంచుకునే ముందు ఆ యువతికి ఎంత ఓపిక , సహనం ఉందో లేదో పరీక్షించమంటున్నారు చాణక్య.

వ్యవహారికం విల్లు నుండి విడిచిన బాణం, నోటి నుంచి జారిన మాట.. తిరిగి తీసుకోలేమని సామెత.  మాటలు మంచి చెడులను తెస్తాయి. కాబట్టి..  జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు.. అవతలి వారి మాట్లాడే విధానం ఎలా ఉంటుందో ముందుగా  నిర్ధారించుకోండి. ఎవరికైనా ఎప్పుడు ఎక్కడ , ఎలా, ఎంత మాట్లాడాలో తెలియాలి. మధురమైన వాక్కుతో ఎవరి మనసునైనా గెలుచుకోవచ్చు. మాట పైనే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి.

మనసు తెలుసుకుని మనువు: చాలా సార్లు కుటుంబ సభ్యులు బలవంతం మీద కొంతమంది యువతీయువకులు పెళ్లికి సిద్ధమవుతారు. మీ కోసం భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు.. మీ భాగస్వామితో పెళ్లి గురించి బహిరంగంగా మాట్లాడండి. ఎక్కడా ఎలాంటి ఒత్తిడికి లోనై పెళ్ళికి అంగీకరించలేదు అనే విషయం నిర్ధారించుకోండి. ఒత్తిడితో పెళ్లి చేసుకుంటే.. ఆ బంధం సరిగ్గా నిలబడదు. అలాంటి బలవంతపు వివాహం  ప్రభావం భవిష్యత్తులో మీకు కనిపిస్తుంది.

ఉన్నత కుటుంబానికి చెందిన కుమార్తెతో వివాహం: ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ ఉత్తమ కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోమని సూచించాడు. వివాహం చేసుకునే అమ్మాయి అందం కంటే.. గుణం, ఉన్నత కుటుంబం, తెలివి తేటలకు ప్రాధాన్యత ఇవ్వమని సూచించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu