Astro tips for house: ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారా?.. అయితే, ఈ వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకోండి..

Astro tips for house : మన జీవితంలో ఐదు అంశాల ఆధారంగా వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు మన ఆనందం, శ్రేయస్సుకు సంబంధించినది.

Astro tips for house: ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారా?.. అయితే, ఈ వాస్తు నియమాలను జాగ్రత్తగా చూసుకోండి..
House
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 24, 2021 | 6:18 AM

Astro tips for house : మన జీవితంలో ఐదు అంశాల ఆధారంగా వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు మన ఆనందం, శ్రేయస్సుకు సంబంధించినది. అందుకే మీరు రెడీమేడ్ ఇంటిని కొనాలనుకుంటే.. వాస్తు విషయాలను అస్సలు విస్మరించొద్దు. కష్టపడి పని చేయడం, అదృష్టం ద్వారా మాత్రమే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అందుకే గృహాన్ని తీసుకునేటప్పుడు ఏమాత్రం తొందరపడకూడదు. వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం తీసుకున్న ఇల్లు మీ జీవితంలో పురోగతి, ప్రతిష్టకు కారకంగా మారుతుంది. ఇంటికి సంబంధించిన చాలా ముఖ్యమైన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. వాస్తు ప్రకారం.. మూసివేసిన వీధిలో చివరి ఇల్లు అశుభం. అలాంటి ఇల్లు మరచిపోయి కూడా కూడా తీసుకోకూడదు. అలాంటి ఇంట్లో నివసించే ప్రజలు తరచుగా ఇబ్బంది పడుతారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టాలను చవిచూస్తారు. 2. ఏదైనా ఇల్లు తీసుకునేటప్పుడు అందులో వంటగది పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. వంటగది వాస్తు ప్రకారమే ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. అగ్నికోణం అంటే ఆగ్నేయ దిశలో వంటగది ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు. 3. వాస్తు ప్రకారం.. ఏ ఇంట్లోనైనా మెట్లు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అది ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల పురోగతికి సంబంధించినది. వాస్తు ప్రకారం.. మెట్లకు సంబంధించిన లోపాలు ఇంట్లో కలహాలకు ప్రధాన కారణం అవుతాయి. అందుకే.. ఏదైనా ఇల్లు తీసుకునేటప్పుడు, మీరు ఆ ఇంట్లోకి ప్రవేశించి మెట్లు కుడి వైపునకు తిరిగి ఉన్నాయా? లేదా? అని చూసుకోండి. 4. వాస్తు ప్రకారం.. ఏ ఇంట్లోనైనా మెట్ల సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉండాలి. అలా ఉంటేనే శుభప్రదంగా పరిగణిస్తారు. మొత్తం పదిహేడు మెట్లు పవిత్రమైనవిగా పరిగణిస్తారు. మెట్లకు సంబంధించిన మరో విషయం ఏంటంటే.. అవి మధ్య చతురస్రాకారంలో ఉండకూడదని, గుండ్రంగా, వక్రంగా, మెలితిప్పినట్లుగా ఉండకూడదు. 5. ఇంటికి తూర్పున పెద్ద చెట్టు ఉంటే అశుభం. అయితే, ఎదురుగా రావి చెట్టు ఉంటే మాత్రం ఆ ఇల్లును శుభప్రదంగా పేర్కొంటారు. 6. వాస్తు ప్రకారం.. ఇంటి ముందు లేదా వెనుక వైపు ఏ దేవత ఆలయం ఉన్నా శుభప్రదంగా పరిగణించరు. అందుకే గుడి ముందున్న ఇల్లు మరిచిపోయి కూడా తీసుకోకూడదు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, ప్రజల ఆచారసంప్రదాయాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్

Keerthy Suresh : చీరకట్టు.. చిరునవ్వు.. కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్న ముద్దుగుమ్మ..

Akhanda: బాలయ్య యాక్షన్‌కు థియేటర్స్ దద్దరిలాల్ల్సిందే.. అఖండలో నటసింహం విశ్వరూపం చూపించనున్నారట..