తాగిన మత్తులో డ్రైవింగ్…ఆపై అల్లకల్లోలం

అసలే రాంగ్‌రూట్‌…ఆపై అతివేగం. మద్యంమత్తులో జెట్ స్పీడుతో కారు నడిపాడు. కళ్లు బైర్లు కమ్మి ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. అంతే క్షణంలో ఓ అమాయకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బైక్‌ వెనకాలే ఉన్న మరో యువతి తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. నోవాటెల్‌ హోటల్‌ నుంచి సైబర్‌ టవర్స్‌వైపు వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఆదివారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మీనాక్షి స్కైలాండ్‌ వద్ద రాంగ్‌రూట్‌లో ప్రవేశించిన కారు అతివేగంతో దూసుకొచ్చింది. […]

తాగిన మత్తులో డ్రైవింగ్...ఆపై అల్లకల్లోలం
Follow us

|

Updated on: Nov 25, 2019 | 12:31 PM

అసలే రాంగ్‌రూట్‌…ఆపై అతివేగం. మద్యంమత్తులో జెట్ స్పీడుతో కారు నడిపాడు. కళ్లు బైర్లు కమ్మి ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. అంతే క్షణంలో ఓ అమాయకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బైక్‌ వెనకాలే ఉన్న మరో యువతి తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఈ ప్రమాదం జరిగింది. నోవాటెల్‌ హోటల్‌ నుంచి సైబర్‌ టవర్స్‌వైపు వస్తున్న బీఎండబ్ల్యూ కారు ఆదివారం అర్థరాత్రి బీభత్సం సృష్టించింది. మీనాక్షి స్కైలాండ్‌ వద్ద రాంగ్‌రూట్‌లో ప్రవేశించిన కారు అతివేగంతో దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న అభిషేక్‌ ఆనంద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌ వెనుక కూర్చున్న యువతి తీవ్రంగా గాయపడింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

బీఎండబ్ల్యూ  కారు నడుపుతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. కారులో అతనితోపాటు మరో ఇద్దరు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. అతివేగంతో కారు నడిపిన ఆ వ్యక్తి ఎవరు..? రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంతో డ్రైవింగ్‌ చేసి ఒకరి ప్రాణాలు బలిగొన్న బడాబాబు ఎవరు..? అతనితో ఉన్న ఆ ఇద్దరు ఎవరు..? పోలీసులు ఎందుకు వారి వివరాలు బయటపెట్టడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లో పోలీసులు వీకెండ్‌లో డ్రంకైన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నా…ప్రమాదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒకరి నిర్లక్ష్యం..మరొకరి ప్రాణాలను బలిగొంటోంది. మద్యంమత్తులో జెట్ స్పీడుతో దూసుకుపోయి పలువురి ప్రాణాలు తీస్తున్నారు. 2016 జూలై 18 వ తేదీన పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ దగ్గర మద్యంమత్తులో కారు నడిపిన యువకులు రమ్య కుటుంబాన్ని బలి తీసుకున్నారు. అది మరువకముందే మొన్న గచ్చిబౌలి బయోడైవర్శి ఫ్లై ఓవర్‌పై అతి వేగంతో దూసుకొచ్చిన కారు సత్యవేణి అనే మహిళ ప్రాణాలు బలి తీసుకుంది.

మొత్తానికి హైదరాబాద్‌ సిటీలో రోడ్డు ప్రమాదాలు ఠారెత్తిస్తున్నాయి. రోడ్డుపై నిర్లక్ష్యంగా, అడ్డూ అదుపు లేకుండా కారు నడుపుతూ పలువురి మృతికి కారణమవుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలే ప్రమాదాలకు ప్రాథమిక కారణమని అధికారులు చెబుతున్నారు. ఏ వాహనానికైనా గరిష్టవేగ పరిమితి 80 కిలోమీటర్లు మాత్రమే. కానీ హైదరాబాద్‌లో కార్లు , ఇతర వాహనాలు 120 కిలోమీటర్ల వేగాన్ని దాటి ప్రయాణం చేస్తున్నాయి. మితిమీరిన వేగం వల్లే దేశంలో 68 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తేలింది.