సైరా క్లైమాక్స్ కి ఫాన్స్ సెగ.. చిరు లేకుండా పవన్ కళ్యాణ్ తో పని కానిచ్చారా ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఇటీవల సెన్సార్ కూడా పూర్తి అవ్వడంతో.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే విడుదల తేది దగ్గర పడుతోన్న సమయంలో సైరా క్లైమాక్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యధాతథంగా తీశారట. ముఖ్యంగా నరసింహారెడ్డికి ఉరి శిక్ష […]

సైరా క్లైమాక్స్ కి ఫాన్స్ సెగ.. చిరు లేకుండా పవన్ కళ్యాణ్ తో పని కానిచ్చారా ?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Sep 27, 2019 | 6:38 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ఇటీవల సెన్సార్ కూడా పూర్తి అవ్వడంతో.. ప్రమోషన్లలో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే విడుదల తేది దగ్గర పడుతోన్న సమయంలో సైరా క్లైమాక్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యధాతథంగా తీశారట. ముఖ్యంగా నరసింహారెడ్డికి ఉరి శిక్ష వేయడం.. ఆ తరువాత ఆయన తలను కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడతీయడం.. వంటి సన్నివేశాలను సినిమాలో చూపించబోతున్నారట.

అయితే ఇలా చిత్రాన్ని పూర్తి విషాదాంతంగా తీస్తే ప్రేక్షకులు.. ముఖ్యంగా చిరు అభిమానులు ఒప్పుకోరని భావించిన చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకుందట. చిరు అస్తమించిన తరువాత.. అప్పట్లో దేశంలో జరిగిన పలు ఉద్యమాలకు నరసింహారెడ్డి పోరాటం ఎలా స్ఫూర్తిని పంచిందో క్లైమాక్స్‌లో చూపించబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో చిరు లేకుండానే.. దాదాపు 15 నిమిషాల వరకు ‘సైరా’ కొనసాగనుందట. అంతేకాదు నరసింహారెడ్డి వీర మరణం తరువాత వచ్చే సన్నివేశాల్లో పవన్ కల్యాణ్ తన వాయిస్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో ఐదు రోజులు ఆగాల్సిందే.

కాగా ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, రవి కిషన్, విజయ్ సేతుపతి, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.