‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’కు ప్రత్యేక రైళ్లు

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యు ఆఫ్ యూనిటీ(సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)కు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. ‘భారత్ దర్శన్ టూర్’ పథకం కింద మార్చి 4వ తేది నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ప్రత్యేక ప్యాకేజీతో పలు పర్యాటక ప్రదేశాలను చుట్టి రావొచ్చని వారు అన్నారు. 7 రాత్రులు, 8 పగళ్లుతో కూడిన ఈ ప్యాకేజీలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ, షిర్డి […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:48 pm, Sat, 23 February 19
‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’కు ప్రత్యేక రైళ్లు

ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యు ఆఫ్ యూనిటీ(సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం)కు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. ‘భారత్ దర్శన్ టూర్’ పథకం కింద మార్చి 4వ తేది నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ప్రత్యేక ప్యాకేజీతో పలు పర్యాటక ప్రదేశాలను చుట్టి రావొచ్చని వారు అన్నారు.

7 రాత్రులు, 8 పగళ్లుతో కూడిన ఈ ప్యాకేజీలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ, షిర్డి సాయి బాబా దర్శనం, త్రయంబకేశ్వరం, గ్రిష్ణేశ్వరం జ్యోతిర్లింగలను చుట్టి రావొచ్చు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి రూ.7,560 చెల్లిస్తే చాలని అధికారులు చెప్పారు. కాగా ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ వరకు వెళ్లనున్న రైలు వడోదర స్టేషన్‌లో ఆగనుంది. అక్కడి నుంచి బస్సులలో పర్యాటకులను స్టాచ్యు ఆఫ్ యూనిటీ వరకు తీసుకెళ్లనున్నారు. ఇదిలా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో  ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ పేరుతో పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.