చదువు బ్రతుకు నేర్పుతుందా?…ఉసురు తీస్తుందా?

చదువు…భవిష్యత్ కోసం. భావితరాలకు మెరుగైన సమాజం నిర్మించడం కోసం. కానీ అదే చదువు ఇప్పడు ముందు తరాల ఉసురు తీస్తుంది. పోటీ ప్రపంచంలో చదువు.. పిల్లలపై భరించలేనంత ఒత్తిడికి గురి చేస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పలితాల అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 15కు పెరిగింది. ఈ గణాంకాలే ఇప్పడు సామాజిక విశ్లేషకులకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఎక్కువ మార్కులు కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులపై  ఒకవైపు నుంచి తల్లిదండ్రుల ఒత్తిడి…మరోవైపు కార్పోరేట్ కాలేజీల విపరీత […]

చదువు బ్రతుకు నేర్పుతుందా?...ఉసురు తీస్తుందా?
Follow us

|

Updated on: Apr 22, 2019 | 5:06 PM

చదువు…భవిష్యత్ కోసం. భావితరాలకు మెరుగైన సమాజం నిర్మించడం కోసం. కానీ అదే చదువు ఇప్పడు ముందు తరాల ఉసురు తీస్తుంది. పోటీ ప్రపంచంలో చదువు.. పిల్లలపై భరించలేనంత ఒత్తిడికి గురి చేస్తుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పలితాల అనంతరం ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య 15కు పెరిగింది. ఈ గణాంకాలే ఇప్పడు సామాజిక విశ్లేషకులకు ఆందోళన కల్గిస్తున్నాయి. ఎక్కువ మార్కులు కోసం, ర్యాంకుల కోసం విద్యార్థులపై  ఒకవైపు నుంచి తల్లిదండ్రుల ఒత్తిడి…మరోవైపు కార్పోరేట్ కాలేజీల విపరీత చర్యలు వెరసి విద్యార్థుల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుులు తిడతారని ఒకరు..స్నేహితుల వద్ద తలెత్తుకులేమని ఇంకొకరు.. సమాజంలో పరువు పోతుంది మరొకరు…ఇలా ఏదో కారణంతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

అసలు చదువు మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరవేస్తుందా? చదువు లేకపోతే ఇంకా ఏ రంగాల్లో రాణించలేమా? చదువు మాత్రమే ప్రజంట్ జనరేషన్‌లో ప్రామాణికతా?..

ఎంతమాత్రం కాదు..చదువులో వెనకబడి ఉండి కూాాడా జీవింతంలో ఊహించని సక్సెస్ అందుకున్న వాళ్లు కోకొల్లలు. డిగ్రీ పట్టా లేకపోయినా…వివిధ రంగాల్లో అసమాన్య ప్రతిభ కనబర్చిన వాళ్లు బోలెడుమంది ఉన్నారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయితే అదేం జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు. విద్యార్థులకు మరో అవకాశం ఉంటుంది. సప్లిమెంటరీలు రాసి మళ్లీ పాస్ కావచ్చు. గత పరీక్షల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఒకవేళ ఇంక పాస్ అవ్వలేము మన లైఫ్ ఇంతే  అనుకుంటే చిల్లర కొట్టు పెట్టుకుని బ్రతకొచ్చు. పుల్ల ఐస్ అమ్ముకుని జీవించొచ్చు. క్రీడలు, సినిమా, బిజినెస్ లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చదువు నిన్ను అవగాహన పరంగా మరో మెట్టు ఎక్కించడానికి, తెలివితేటలు పెంచుకోడానికి అంతే. చదువులో ఫెయిల్ అయితే బ్రతుకులో ఫెయిల్ అయినట్టు కానేకాదు. బ్రతకడానికి 100 మార్గాలు ఉన్నాయి. నువ్వు సరిగ్గా అనుకుంటే చులకనగా చేసిన సమాజం ముందే తలెత్తుకొని జీవించవచ్చు. కానీ ఇదేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగల్చుతున్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భావి పౌరులు జీవితం మధ్యలోనే తనువు చాలిస్తున్నారని..విద్యార్థులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని చెప్పారు. ఫెయిలైన విద్యార్థులను తిట్టకుండా, వేధించకుండా సముదాయించాలని..తిరిగి పాసయ్యేలా ప్రోత్సహించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్ లోకి వెళ్లిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.

చదువు నిన్ను జస్ట్ పరిక్షల్లో పాస్ చేయిస్తుంది. సొసైటీని చదువు.. జీవితంలో పాస్ అవుతావ్

Life is 10% what happens to you and 90% how you react to it.

TV9-FOR BETTER SOCIETY

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్