త్రి నేత్రంతో కాపాడుతున్న మహాశివుడు..!

అక్కడ వెలసిన ఆ ఆలయం ఎంతో మహిమానిత్వమట. సాక్ష్యత్తు మహాశివుడే..తన త్రినేత్రంతో అక్కడి వారందరినీ కాపాడుతున్నాడని స్థానికులంతా ఆ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో దర్శించి తరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని సుగ్లాంపల్లి గ్రామం మీదుగా ఉన్న రాజీవ్‌ రహదారి ఒకప్పుడు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ రహదారిపై ప్రతినిత్యం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూ ప్రజలు, ప్రయాణికులు ప్రాణాలు కొల్పోతుండేవారట. అనేక మంది తీవ్రంగా గాయపడిన […]

త్రి నేత్రంతో కాపాడుతున్న మహాశివుడు..!
Follow us

|

Updated on: Nov 09, 2019 | 6:53 PM

అక్కడ వెలసిన ఆ ఆలయం ఎంతో మహిమానిత్వమట. సాక్ష్యత్తు మహాశివుడే..తన త్రినేత్రంతో అక్కడి వారందరినీ కాపాడుతున్నాడని స్థానికులంతా ఆ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో దర్శించి తరిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని సుగ్లాంపల్లి గ్రామం మీదుగా ఉన్న రాజీవ్‌ రహదారి ఒకప్పుడు ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ రహదారిపై ప్రతినిత్యం ఏదో రకంగా ప్రమాదాలు జరుగుతూ ప్రజలు, ప్రయాణికులు ప్రాణాలు కొల్పోతుండేవారట. అనేక మంది తీవ్రంగా గాయపడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో ఓ రైస్‌ మిల్లు కూడా ఉంది. దాని ఎదురుగా ఉన్న ఒక రోడ్డు, దానిని అనుకునే రాజీవ్‌ రహదారి ఉండటంతో ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువగా ఉండేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఓ పండితుడు చెప్పిన మాటప్రకారం రైస్‌ మిల్లుకు ఎదురుగా ఎదురుగా వీధి పోటు ఉన్నందు వల్లే అక్కడ రక్త తర్పణం జరుగుతుందని, అక్కడ శివాలయం నిర్మించినట్లయితే, ప్రమాదాలను అరికట్టవచ్చని చెప్పారట. సిద్ధాంతి చెప్పిన మాట మేరకు  అక్కడ శివాలయం నిర్మించారు. అందులోనే మహా గణపతి, నాగప్రతిమలను ప్రతిష్టించారు. ప్రతినిత్యం అక్కడ దూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ..పూజాది కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇక అప్పటి నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గాయిని చెబుతున్నారు. అంతేకాదు, రైస్‌ మిల్లు కూడా మంచి లాభాలతో కొనసాగుతోందని అంటున్నారు మిల్లు సిబ్బంది, స్థానికులు. ఏదేమైనప్పటికీ సుగ్లాంపల్లి సమీపంలో ప్రమాదాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, ఈ మార్గంలో ప్రయాణించే వారంతా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని ఇటు స్థానిక ప్రజలు, అటు ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.