తిరుమల శ్రీవారి ఆన్‌లైన్‌ కల్యాణోత్సవానికి విశేష స్పందన!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో ప్రారంభించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆన్‌లైన్‌ కల్యాణోత్సవానికి విశేష స్పందన!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 6:43 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో ప్రారంభించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సేవకు సంబంధించిన టికెట్లను భక్తులు భారీగా కొనుగోలు చేస్తున్నట్టు టీటీడీ పేర్కొంది. కరోనా నేపథ్యంలో లోక కల్యాణార్థం శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఆలయంలో రోజూ ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఈనెల ఏడో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవానికి టీటీడీ శ్రీకారం చుట్టింది.

కాగా.. ఈ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌ కల్యాణోత్సవ కోటాను ఆరో తేదీనే విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో రూ.వెయ్యి ధర కలిగిన టికెట్టు కొనుగోలు చేసే గృహస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి, ఎస్వీబీసీ ద్వారా లైవ్‌ చూస్తూ.. అర్చక స్వాముల సూచనల మేరకు గోత్రనామాలతో సంకల్పం చెప్పేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో తొలిరోజైన ఈనెల ఏడో తేదీన 118 మంది భక్తులు ఆన్‌లైన్‌ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. రెండో రోజు 496 మంది టికెట్లు కొనుగోలు చేశారు. 15వ తేదీన అత్యధికంగా 895 మంది సేవలో పాల్గొన్నారు.

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!