రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలిః టీజీ వెంకటేష్‌

TG Venkatesh Bjp MLA, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలిః టీజీ వెంకటేష్‌

తెలంగాణ కన్నా రాయలసీమ పూర్తిగా వెనకబడ్డ ప్రాంతమని, రాయలసీమ బాగుపడటం కోసం స్పెషల్ స్టేటస్‌తో పాటు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బిజెపి ఎంపీ, రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూల్ లో జరిగిన రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సీమ అభివృద్ధి కోసం శాంతియుతంగా పోరాడే వారికి పూర్తి మద్దతిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే విధంగా ముందుకు పోవాలని సూచించారు. కళ్లముందు నీరున్నా తాగలేని పరిస్థితి సీమలో నెలకొందని, శ్రీశైలం ఒక స్టోరేజ్ ట్యాంక్‌లా మిగిలిన ప్రాంతాలకు మాత్రం ఉపయోగపడుతోందన్నారు. బీజేపీ రాయలసీమ అభివృద్ధికి డిక్లరేషన్ ఇచ్చిందని టీజీ వెంకటేశ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *