‘మీకు మాత్రమే చెప్తా’ సీక్రెట్స్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా అవతరమెత్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్‌తో స్పెషల్ చిట్ చాట్… మీరు హీరోగా చేయాల్సిన సినిమాకు నిర్మాత ఎలా అయ్యారు? ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో షామీర్ అండ్ అర్జున్ ఒకసారి […]

'మీకు మాత్రమే చెప్తా' సీక్రెట్స్ రివీల్ చేసిన విజయ్ దేవరకొండ!
Follow us

|

Updated on: Nov 01, 2019 | 4:34 AM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా అవతరమెత్తి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో షామీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విజయ్‌తో స్పెషల్ చిట్ చాట్…

మీరు హీరోగా చేయాల్సిన సినిమాకు నిర్మాత ఎలా అయ్యారు?

‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో షామీర్ అండ్ అర్జున్ ఒకసారి నన్ను కలవడానికి వచ్చారు. అప్పటికే వాళ్ళు చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చూశాను. తక్కువ బడ్జెట్‌‌తో రిచ్‌గా తెరకెక్కించారు. అప్పుడే వీళ్ళతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇక ఆ తర్వాత కొద్దిరోజులకు వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ కథ చెప్పారు. స్క్రిప్ట్ బాగా నచ్చింది.. కానీ ఆ సమయంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అది కాస్తా విడుదల అయ్యాక నేను హీరోగా చేయడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నిర్మాతగా మారాను.

ఈ సినిమాకు తరుణ్ భాస్కర్‌నే ఎందుకు హీరోగా ఎంచుకున్నారు?

ఈ పాత్రకు తరుణ్ భాస్కర్ అయితేనే చాలా బాగుంటుందనిపించింది. ఎందుకంటే ‘పెళ్లి చూపులు’ సినిమా చేస్తున్నప్పుడు అతడు సీన్స్‌లో యాక్ట్ చేసి మరీ చూపించేవాడు. నిజానికి మాకన్నా బాగా నటించేవాడు. అందుకే ఈ సినిమాకు సూట్ అవుతాడని అనుకున్నాను. మొదట ఒప్పుకోకపోయినా.. చివరికి ఓకే చెప్పాడు.

నిర్మాతగా ఈ సినిమాలో ఎంతవరకు ఇన్‌వాల్వ్ అయ్యారు?

స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక, ఇక నేను ఈ సినిమాలో ఎక్కడ కూడా ఇన్‌వాల్వ్ కాలేదు. సెట్ కి ఒకే ఒక్క సారి వెళ్ళాను. అది కూడా వస్తే బాగుటుంది అని అడిగితేనే వచ్చాను. అంటే ఇంక దేని గురించి పట్టించుకోలేదు.

సినిమాకు బడ్జెట్ ఎంతయ్యింది.?

నేను ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి వచ్చిన 70 శాతం రెమ్యునరేషన్స్‌ను ఈ సినిమాకే ఖర్చు చేశాను. మొదట్లో మా డాడీ ఎందుకు మనకు ప్రొడక్షన్ అని చెప్పినా.. స్క్రిప్ట్ బాగుండటంతో అవేమి పట్టించుకోలేదు. అయితే గుడ్డిగా మాత్రం ఏమి చేయలేదు. టీమ్ మీద పూర్తి నమ్మకంతో రిస్క్ తీసుకుని మరీ చేశాను. నా మీద నమ్మకంతో నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే ఇప్పటికీ చిన్న ఇంట్లో అద్దెకు ఉండేవాడని..

‘మీకు మాత్రమే చెప్తా’లో మీకు నచ్చిన అంశం ఏంటి?

ఈ కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. సరిగ్గా నాలాగే ఆడియన్స్ కూడా థియేటర్ల నుంచి నవ్వుకుంటూనే వస్తారు. ఈ రోజుల్లో మంచి హ్యూమర్ ఉన్న కథలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఖచ్చితంగా వారికి నచ్చుతుందని అనుకుంటున్నాను.

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా షూటింగ్ మరో ఎనిమిది రోజుల్లో ముగిస్తుంది. జనవరి నుంచి పూరి జగన్నాధ్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత శివ నిర్వాణతో ఓ సినిమా ఉంటుంది.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!