‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. అతిధుల లిస్ట్ అదరహో!

Sye Raa Pre Release Event In Hyderabad, ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. అతిధుల లిస్ట్ అదరహో!

దర్శకధీరుడు రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మంత్రి కేటీఆర్, దర్శకులు కొరటాల శివ, వి.వి.వినాయక్.. ఇప్పుడు ఈ ఐదుగురు ఒకే వేదికను పంచుకోనున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిధులు వీరే. ఇప్పటికే కొణిదెల కాంపౌండ్‌ నుంచి వీరికి ఇన్విటేషన్ కూడా వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

‘సైరా’ నరసింహరెడ్డి ప్రీ-రిలీజ్ వేడుక కర్నూలులో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది కాస్తా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. ఈ నెల 18న ఎల్బీ స్టేడియం వేదికగా ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ జరగనుంది. ఇటీవల ‘సాహో’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతకుమించి మెగా అభిమానుల సమక్షంలో భారీగా ‘సైరా’ ఈవెంట్‌ను చేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారట. ఎస్.ఎస్.రాజమౌళి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్- మంత్రి కేటీఆర్ ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరు అభిమానించుకుంటారు. ఇలా ఆడియో ఫంక్షన్‌లో ఒకే ఫ్రేమ్ పంచుకోవడం తొలిసారి. వాట్ ఏ ఇంటరెస్టింగ్ న్యూస్ కదూ!

మరోవైపు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, నిహారిక కొణిదెల, అనుష్క వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కాగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.

అటు మంత్రి కేటీఆర్ ఈ వేదికకు హాజరు కాలేరని సమాచారం అందింది. ఈ విషయాన్ని స్వయంగా కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *