Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

చిద్దూ కథ కంచికేనా ?

chidambaram story ends, చిద్దూ కథ కంచికేనా ?

కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కథ కంచికేనా ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ.. ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు చిదంబరానికి అశనిపాతంలా తగిలాయి. ఆయనపై పలు అభియోగాలున్నందున అరెస్టు చేసి విచారణ జరుపుతామన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను ప్రత్యేక కోర్టు ఆమోదించింది. చిదంబరంను అరెస్టు చేయొచ్చని స్పెషల్ జడ్జి మంగళవారం ఆదేశాలిచ్చారు.

ఐఎన్ఎక్స్  మీడియా కేసులో నమోదైన కేసుల్లో సిబిఐ ఇప్పటికే చిదంబరంను అరెస్టు చేసి, రిమాండ్ కు పంపింది. పలు దఫాలుగా ఆయన్ను కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. గత కొంత కాలంగా జ్యూడిషియల్ రిమాండ్ లో వున్న చిదంబరం అరెస్టును ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి చిదంబరం అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి బెయిల్ లభించినా.. ఆ వెంటనే ఈడీ అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.

ఒకవేళ సిబిఐ కేసుల్లో చిదంబరం బెయిల్ మీద బయటికొస్తే.. ఆ వెంటనే ఆయన్న కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ సిద్దమవుతోంది. లండన్ తోపాటు పలు యూరొప్ దేశాల్లో చిదంబరానికి, ఆయన వారసుడు కార్తీ చిదంబరానికి పెద్ద ఎత్తున ఆస్తులున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. యుకేలోని అతిపెద్ద రిసార్టు ఆధారాలను ప్రత్యేక కోర్టకు సమర్పించింది ఈడీ. సో.. చిదంబరం చుట్టూ ఉచ్చు పెద్ద ఎత్తున బిగుస్తుండడంతో ఆయన ఇక జైలు జీవితానికే పరిమితమయ్యే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బెయిల్ దొరికినా.. ఆయన్ను జీవితాంతం కేసులు వెంటాడే సంకేతాలు కూడా అంతే బలంగా వున్నాయి. సో.. పలు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చిదంబరం కథ ఇక కంచికేనా ? అంటే అవుననే అనాల్సి వస్తుంది.