న్యూ ఇయర్ వేడుకలు: ఎక్కడెక్కడ ఎలా చేసుకుంటారంటే..!

మరికొన్ని గంటల్లో పాత సంవత్సరానికి బైబై చెప్పేసి.. న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. తమకు ఉన్నంతలో, తోచినంతలో ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే న్యూ ఇయర్ అంటే కేక్‌లు కట్ చేసుకోవడం, మందు పార్టీలను చేసుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో నివసించే ప్రజలు.. ఒక్కో విధంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. – స్పానిష్‌లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి […]

న్యూ ఇయర్ వేడుకలు: ఎక్కడెక్కడ ఎలా చేసుకుంటారంటే..!
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 4:29 PM

మరికొన్ని గంటల్లో పాత సంవత్సరానికి బైబై చెప్పేసి.. న్యూ ఇయర్‌లోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు అందరూ సిద్ధమయ్యారు. తమకు ఉన్నంతలో, తోచినంతలో ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే న్యూ ఇయర్ అంటే కేక్‌లు కట్ చేసుకోవడం, మందు పార్టీలను చేసుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని ప్రదేశాల్లో నివసించే ప్రజలు.. ఒక్కో విధంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

– స్పానిష్‌లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల సమయంలో 12 ద్రాక్ష పళ్లను తినడం ఆనవాయితీగా వస్తోంది. 12 గంటల సమయంలో 12 సార్లు గడియారం ముళ్లు కొట్టినప్పుడు 12 ద్రాక్ష పళ్లను తినాలి. అలా తినలేకపోతే ఆ సంవత్సరం వారికి కలిసి రాదని చాలా మంది నమ్ముతుంటారు.

-ఎల్ సాల్వడార్‌లో కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఒక్క నిమిషం ముందు పచ్చి గుడ్డును కొట్టి ఒక గ్లాస్‌లో వేసి, అందులో నీటిని పోస్తారు. మరుసటి రోజు అందులోని సొన(పచ్చ పదార్థం)ఎలా కనిపిస్తే.. ఆ సంవత్సరం వారికి అలా జరుగుతుందని భావిస్తుంటారు.

-టర్కీలోని కొన్ని ప్రాంతాల్లో న్యూ ఇయర్ వచ్చినప్పుడు.. ఎర్రగా ఉండే పళ్లను ఇంటి ముందు పగలగొడతారు. అందులో నుంచి గింజలు ఎంత ఎక్కువ బయటపడితే అంత ధనం వస్తుందని అక్కడి వారు నమ్ముతుంటారు.

-జర్మనీలోని కొన్ని ప్రదేశాల్లో న్యూ ఇయర్ రోజున పందిలాగా తయారు చేసిన స్వీట్‌ను తింటుంటారు. అక్కడి వారు పందిని డబ్బుకు గుర్తుగా భావిస్తుందట. న్యూ ఇయర్ రోజు వాటి ఆకారంలో తయారు చేసిన షుగర్ పిగ్‌లను తింటుంటారు. దీని వలన కొత్త సంవత్సరంలో వారి జీవితంలో మరింత తీపి కలుగుతుందని వారు భావిస్తుంటారు.

-జపాన్‌లో నూతన సంవత్సరం రోజున అర్ధరాత్రి సమయంలో గంటలు మోగిస్తారు. రాత్రి 12 సమయంలో 108సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ భవిష్యత్ బావుంటుందని అక్కడి వారు భావిస్తుంటారు. చెక్ రిపబ్లిక్‌లో నూతన సంవత్సరం రోజు యాపిల్ కట్ చేస్తారు. యాపిల్‌ను మధ్యలోకి కోసినప్పుడు విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే ఆ సంవత్సరమంతా మంచి జరుగుతుందన్నది వారి నమ్మకం. అదే క్రాస్ వస్తే చెడు జరుతుందని అక్కడి వారు బలంగా నమ్ముతారు.

-డెన్మార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 31న రాత్రి ప్లేట్లు, కప్పులు, స్పూన్‌లు లాంటివి విరగ్గొట్టేస్తుంటారు. అలా చేస్తే అదృష్టం తమని వరిస్తుందని అక్కడి ప్రజల గట్టి విశ్వాసం.

-గ్రీస్‌లో కొత్త సంవత్సరం రోజున చర్చికి వెళ్లి ఉల్లిపాయలు ఇస్తారు. ఉల్లితో దండను చేసి గుమ్మానికి వేళ్లాడతీస్తారు. ఉల్లిపాయలు ఉంటే ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతుందని అక్కడి వారు భావిస్తారు.

-ఇటలీలో కొత్త సంవత్సరాన్ని కాస్త వినూత్నంగా జరుపుకుంటారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేస్తారు. అలా బయటపడేయడమంటే మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను తొలగించుకోవడమేనన్నది అక్కడి వారి అభిప్రాయం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..