చెన్నై బీచ్ లో నీలి రంగు అలలు.. వాటే రేర్ వండర్ సీన్ !

sparkling blue waves in chennai leave people in awe scientists curious, చెన్నై బీచ్ లో నీలి రంగు అలలు.. వాటే రేర్ వండర్ సీన్ !

చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని బీచ్ లో ఆదివారం సాయంత్రం సరదాగా షికారుకు వెళ్ళినవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తాము ఎన్నడూ చూడని దృశ్యం చూసి స్టన్ అయ్యారు. సముద్రపు అలలు మామూలుగా తెల్లని రంగులో కాక, నీలి (బ్లూ) రంగులో కనబడేసరికి వారి ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. తిరువన్మియూర్ బీచ్ లోను, పాలవక్కం, ఇంజంబాక్కం సముద్ర తీరాల్లో సైతం ఇలాంటి అసాధారణ, అరుదైన సీనే కనబడింది. బ్లూ వేవ్స్ లేదా బ్లూ టైడ్స్ అన్నదాన్నే ‘ బైల్యుమినెసెన్స్ ‘ అని అంటారట. ‘ బైల్యుమినెసెంట్ ఫైటోప్లాంక్టన్ ‘ అనే ఆల్గె (సముద్రపు నాచు) కారణంగా అలలు ఈ రంగులోకి మారినట్టు భావిస్తున్నారు. ఈ ఆల్గె తన కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకున్నప్పుడు సముద్ర తరంగాలు నీలి రంగులో కనిపిస్తాయని అంటున్నారు. సైంటిఫిక్ గా ఈ ఆల్గె స్పీసీస్ ని ‘ నాక్టిలుకా సింటిల్లాన్స్ ‘ అని వ్యవహరిస్తారని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీన్నే కామన్ గా ‘ సీ స్పార్కిల్ ‘ అని సైతం అంటారని వారు పేర్కొన్నారు.

ఇలాంటి తరంగాలు గత ఏడాది మాల్దీవుల్లో.. హిందూమహాసముద్రంలో కనిపించాయి. తరచూ కాలిఫోర్నియాలోని బీచ్ లో పసిఫిక్ మహాసముద్ర తరంగాలు కూడా ఇలాంటి నీలి రంగులోనే కనిపించాయట. మెరైన్ ఎకో సిస్టం లో ఏర్పడే మార్పుల వల్ల ఈ విధమైన పరిణామాలు సంభవిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఏమైనా…. ముఖ్యంగా తమిళనాడు కోస్తా తీరానికి దీనివల్ల ముప్పు కలగవచ్చునని భయపడుతున్నారు. క్లైమేట్ ఛేంజ్ కారణంగా సముద్ర జలాలు వేడెక్కిపోవచ్చునన్నది కూడా ఓ అంచనా.
ఏది ఏమైనప్పటికీ రాత్రివేళ సముద్ర తరంగాలు నీలి రంగులో  కనబడిన అద్భుత దృశ్యాన్ని విజిటర్లు ఫోటోలు తీసుకున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *