ఆ రూమర్స్ సరికాదు…: ఎస్పీ చరణ్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాని జయించినా.. ఇతర సమస్యల కారణంగా ఆయన మృతి చెందారని ఎంజీఎం హాస్పిటల్‌ సిబ్బంది చెప్పిన విషయం తెలిసిందే. అయితే బాలు కోలుకుంటున్నారని, మ్యూజిక్‌ వింటున్నారని, ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్నారని ఆయన తనయుడు చరణ్‌ చెబుతుంటే..

ఆ రూమర్స్ సరికాదు...: ఎస్పీ చరణ్
Follow us

|

Updated on: Sep 28, 2020 | 5:15 PM

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాని జయించినా.. ఇతర సమస్యల కారణంగా ఆయన మృతి చెందారని ఎంజీఎం హాస్పిటల్‌ సిబ్బంది చెప్పిన విషయం తెలిసిందే. అయితే బాలు కోలుకుంటున్నారని, మ్యూజిక్‌ వింటున్నారని, ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూస్తున్నారని ఆయన తనయుడు చరణ్‌ చెబుతుంటే.. సంగీత ప్రపంచమే కాదు.. బాలు అభిమానులందరూ ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ఎంతో ఆనంద పడ్డారు.

కానీ సడెన్‌గా ఆయనకు సీరియస్‌గా ఉందనే వార్తలు వచ్చిన 24 గంటల్లో ఆయన మరణవార్త వినాల్సి రావడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో కొందరు ఎంజీఎం హాస్పిటల్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మనీ కోసమే ఇన్నాళ్లు బాలుని ఇబ్బంది పెట్టారని, బాలు మృతి వెనుక ఏదో పెద్ద కారణం ఉందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అవుతున్నారు.

అయితే అలాంటిదేమీ లేదని, దయచేసి అలాంటి రూమర్స్ వ్యాపింప చేయవద్దని అంటున్నారు ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌. ఇందుకు సంబంధించన ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. బాలు ఆస్పత్రి‌లో చేరినప్పటి నుంచి, ఈ నెల 24 వరకు ఎంజీఎం డాక్టర్స్ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని.. డాక్టర్స్ కూడా ప్రార్థనలు చేశారని తెలిపారు. ప్రతి విషయంలోనూ వారు వెన్నంటే ఉన్నట్లుగా ఆ వీడియోలో పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వం, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రతిరోజూ బాలు ఆరోగ్యం గురించి తెలుసుకునేవారని వెల్లడించారు. మనీ విషయంలో కూడా వస్తున్న రూమర్స్ నిజం కాదని అన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ సృష్టించి తమని మరింత బాధపెట్టవద్దని ఆయన కోరారు. నాన్నగారిని అభిమానించే వాళ్లు చేసే పని ఇది కాదని… ఇలాంటి సమయంలో ఇటువంటి వార్తలు మమ్మల్ని మరింతగా బాధపెడతాయని అన్నారు ఎస్పీ చరణ్‌.

“కరోనా వచ్చింది..పోయింది… కాని ఊపిరితిత్తులు ఇన్ ఫెక్షన్ బాగా ఇబ్బంది పెట్టిందన్నారు. ఊపిరితిత్తులు సమస్యతోనే నాన్న చనిపోయారు. కరోనా కారణంగా నాన్న చనిపోలేదని అన్నారు. అయితే నాన్న గారి ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తాను… నాకు మా నాన్నే భారత రత్న. నాన్నగారే లేనప్పుడు అవీ ఎమీ ఏముంటుంది. భారతరత్న నాన్నకు ఇస్తే సంతోషిస్తాను” అని తన వీడియోలో పేర్కొన్నారు.

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..