గంధర్వలోకానికి గాన గంధర్వుడు

ఎస్పీబీ.. భారతీయ సంగీత ప్రపంచంలో ఈ మూడక్షరాలు తారక మంత్రం లాంటివి. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమన్యం.. అనేది గుండెను తడిపే తియ్యటి పాటకు మారు పేరుగా చెప్పుకోవచ్చు. ఉత్తర దక్షిణాది ప్రాంతాలన్నిటిలో బాలు అనే ముద్దుపేరుతో పిలిపించుకుని.. కమ్మని పాటకు కేరాఫ్ అనిపించుకున్నారు బాలు.

గంధర్వలోకానికి గాన గంధర్వుడు
Follow us

|

Updated on: Sep 25, 2020 | 2:18 PM

ఎస్పీబీ.. భారతీయ సంగీత ప్రపంచంలో ఈ మూడక్షరాలు తారక మంత్రం లాంటివి. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమన్యం.. అనేది గుండెను తడిపే తియ్యటి పాటకు మారు పేరుగా చెప్పుకోవచ్చు. ఉత్తర దక్షిణాది ప్రాంతాలన్నిటిలో బాలు అనే ముద్దుపేరుతో పిలిపించుకుని.. కమ్మని పాటకు కేరాఫ్ అనిపించుకున్నారు బాలు.

నెల్లూరులో 1946లో జూన్ 4న జన్మించిన బాలు ప్రధాన వృత్తిని గాయకుడిగానే మొదలుపెట్టారు. తర్వాత సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సినిమా పరిశ్రమలో అన్ని మూలాల్లోకి చేరుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు 15 భాషల్లో 40 వేల పాటలు పాడారు. 1966లో తెలుగు పాటతో తన ప్రయాణం మొదలుపెట్టి.. విశ్వాఅంతరాలకు తన ఖ్యాతిని విస్తరించుకున్నారు.

చదువు కోసం మద్రాసు వెళ్లి.. సినీరంగ ప్రవేశం చేసారు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకునిగా మొదటి అడుగు పడింది. సంగీత దర్శకుడు కోదండపాణిని తన ఆత్మీయ గురువుగా పేర్కొంటారు. అయన మీద అభిమానంతోనే తన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని నామకరణం చేసుకున్నారు. ఏకంగా 53 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

తమిళ్ నట దిగ్గజం ఎంజీఆర్ ‘అడిమై పెన్’ మూవీ కోసం అడిగి మరీ రాయించుకున్న ఒక పాట తమిళ్ ఇండస్ట్రీలో బాలుకి బ్రేక్ ఇచ్చింది. తర్వాత.. తెలుగేతర సంగీత ప్రపంచంలో కూడా బాలుకి తిరుగు లేకుండా పోయింది. శాస్త్రీయ సంగీతం తెలియకముందే క్లాసికల్ సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే.. ట్రెడిషనల్ మ్యూజిక్ నేర్చుకున్నారు బాలు. జంధ్యాల తీసిన పడమటి సంధ్యారాగం సినిమాలో ఒక పాటను రాశారు కూడా.

వేగానికి వేగం.. నాణ్యతకు నాణ్యత.. ఎందులోనూ రాజీ పడే మనస్తత్వం కాదు బాలుది. ఒకానొక సమయంలో ఆయనెంత బిజీగా వుండేవారంటే.. ఒక్కరోజులో ఏకంగా 17 పాటలు పాడి ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. 1981లో ఉపేంద్ర కుమార్ అనే కన్నడ కంపోజర్ దగ్గర ఈ హిస్టరీ క్రియేట్ అయింది. మరెవ్వరూ మరెప్పుడూ సాధించలేని అరుదైన ఘనత ఇది.

ఎన్ని భాషల్లో ప్రావీణ్యం సంపాదించినా.. మాతృ భాష తెలుగంటే ఆయనకు ప్రాణప్రదం. ప్రతి మాటనూ తెలుగుతో మొదలు పెట్టి తెలుగులోనే ముగించేలా ప్రయత్నిస్తారు.. చివరి వరకు తెలుగు భాష ఉనికి కోసం తాపత్రయ పడ్డారు. తెలుగు భాషకు ఊపిరిలూదుతూనే తన ఊపిరి వదిలారు.

ఆయన పాటయినా, ఆయన మాటయినా ఒక లాలనలా.. లయబద్ధంగా ఉంటుంది. చెవికింపుగా ఉంటుంది.. మనసు పెట్టి వినాలనిపిస్తుంది. కాసేపు నెల్లూరోడుగా మాట్లాడతారు, ఆ వెంటనే చిత్తూరు యాసలోకి మారిపోతారు.. గుంటూరు మాటలూ వల్లిస్తుంటారు. ఏ వయసు వాళ్ళతో ఎలా మాట్లాడాలి.. ఈ స్థాయి వాళ్లతో ఎలా వ్యవహరించాలన్న సంపూర్ణ పరిణితి బాలు సొంతం.

శంకరాభరణం సినిమాకు సంగీతమే ప్రాణం అయితే.. ఆ సంగీతానికి బాలు గళమే ఆయువు. ఆయన పాడిన ఓంకార నాదాలు అనే పాటకు ఎన్టీయార్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. హిందీలో ప్రవేశించడమే బ్లాక్ బస్టర్ పాటలతో అదరగొట్టారు. ఏక్ దూజే కేలియా మ్యూజికల్ హిట్ కావడానికి కారకులు బాలు గారే.

5 సార్లు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన గొప్ప గొప్ప పాటలున్నాయి ఆయన కెరీర్లో. వరసబెట్టి ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్న బాలు పాటకు ఆబాల గోపాలం ప్రణమిల్లుతారు.. ప్రాణమిస్తారు. బుల్లితెరపై కూడా పాడుతా తియ్యగా అనే కార్యక్రమంతో తన గాన మాధుర్యాన్ని పంచుతూ.. వ్యాఖ్యాతగా, సంధాన కర్తగా వ్యవహరించేవారు. 24 వసంతాల నుంచి తనదైన తీరులో తర్ఫీదునిస్తూ ఎన్నో వేల మంది ఆణిముత్యాల్ని అందించారు. తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ టెలివిజన్ ఛానల్స్ లో కూడా బాలు పాట కచ్చేరి దిగ్విజయంగా నడిచింది.

బాలుగారిలో ఒక గొప్ప సామాజిక వేత్త కనిపిస్తారు. నెల్లూరులోని తన నివాసాన్ని ఓ గొప్ప కార్యం కోసం త్యాగం చేశారు. వేద పాఠశాల నిర్వహణ కోసం బాలసుబ్రహ్మణ్యం తన నివాసాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి సమర్పించారు. శ్రీశైలం, మంత్రాలయం పుణ్యక్షేత్రాలకు ఆస్దాన విద్వాంసులుగా ఉండేవారు. కరోనా వైరస్ మహమ్మారి పేట్రేగిపోతున్న వేళ.. అన్నార్తులకు సాయం చేయడం కోసం తన గళాన్ని అరువిచ్చి ఆన్లైన్లో జోలె పట్టారు. తన స్వరం లాగే తన మనసు కూడా మధురాతి మధురం అని చాటుకున్నారు.. బాలు గారు.

శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
తవ్వకాల్లో బయటపడ్డ కృష్ణుడి విగ్రహం.. కట్ చేస్తే.. షాకింగ్ నిజంతో
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.