రాణించిన చాహల్.. భారత లక్ష్యం 228

వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆట చివరి వరకు ప్రత్యర్థిని బంతితో భయపెట్టారు. మెగా టోర్నోలో సౌత్ ఆఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. యుజువేంద్ర చాహల్(4/51), బుమ్రా(2/35), భువీ(2/44) బౌలింగ్‌లో విజృంభించడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 54 బంతుల్లో 38 పరుగులు చేశాడు. వాన్ డర్ డుస్సెన్ 22 పరుగులు, డేవిడ్ మిల్లర్ 31 […]

రాణించిన చాహల్.. భారత లక్ష్యం 228
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2019 | 7:02 PM

వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆట చివరి వరకు ప్రత్యర్థిని బంతితో భయపెట్టారు. మెగా టోర్నోలో సౌత్ ఆఫ్రికా పేలవ బ్యాటింగ్ ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. యుజువేంద్ర చాహల్(4/51), బుమ్రా(2/35), భువీ(2/44) బౌలింగ్‌లో విజృంభించడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు మాత్రమే చేసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్ 54 బంతుల్లో 38 పరుగులు చేశాడు. వాన్ డర్ డుస్సెన్ 22 పరుగులు, డేవిడ్ మిల్లర్ 31 పరుగులు, ఫెలుక్వాయో 34 పరుగులతో రాణించారు. ఆఖర్లో క్రిస్‌మోరీస్, రబాడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. ఆ మాత్రం స్కొర్ చేయగలిగింది. అయితే ఓ దశలో 150 పరుగులలోపే ఆలౌట్ అవుతుందనుకోగా.. 227 పరుగులు చేసింది.