వంగా మళ్ళీ బాలీవుడ్‌లోనే.. టైటిల్ ‘డెవిల్’?

Sandeep Vanga Next Movie Title Devil, వంగా మళ్ళీ బాలీవుడ్‌లోనే.. టైటిల్ ‘డెవిల్’?

సందీప్ రెడ్డి వంగా.. తీసినవి రెండు సినిమాలే అయినా ఈయన పాపులారిటీ దేశవ్యాప్తంగా వ్యాపించడానికి ముఖ్య కారణం ‘అర్జున్ రెడ్డి’. హీరో విజయ్ దేవరకొండతో తీసిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అప్పటివరకు సాధారణ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఒక్కసారిగా యూత్ సెన్సేషన్‌గా మారిపోయాడు. యూత్ మొత్తం ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో లవ్ పడిపోయారని చెప్పడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు.

అటు హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా బాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించింది. కమర్షియల్ హిట్‌గా బాక్స్ ఆఫీస్ వసూళ్లుల్లో కొత్త రికార్డులు సృష్టించింది. కొందరు క్రిటిక్స్ మాత్రం ఇటు తెలుగు ‘అర్జున్ రెడ్డి’ని.. అటు హిందీ ‘కబీర్ సింగ్’ను విమర్శించిన మాట వాస్తవమే. అయితే ఎవరు ఎన్ని లెక్కలు కట్టినా బాక్స్ ఆఫీస్ లెక్కలు ప్రకారం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రెండు ఇండస్ట్రీలలోనూ విజయం సాధించాడని చెప్పవచ్చు.

దీంతో సందీప్ వంగా తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ‘కబీర్ సింగ్’ తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అవన్నీ వట్టి పుకార్లనేలా తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన మళ్ళీ బాలీవుడ్ హీరోతోనే సినిమా చేస్తున్నారట. బీ-టౌన్ యంగ్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్‌కు ఇటీవల ఓ స్టోరీ లైన్ చెప్పడం.. దానికి రణబీర్ కూడా ఓకే చెప్పడం జరిగిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఒక ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అని.. ఈ సినిమాలో రణబీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించనున్నాడట. అంతేకాకుండా ఈ సినిమాకు సందీప్ వంగా ‘డెవిల్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నాడని సమాచారం. బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *