దాదా టీంలోకి హర్భజన్..! ట్వీట్ రిప్లై ఉద్దేశ్యం అదేనా..?

బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దేశ వ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెల్పుతున్నారు. అంతేకాదు.. ఆయన సహచర టీం మాజీ ప్లేయర్లు కూడా దాదాకి శుభాకాంక్షలు తెల్పుతూ.. వారి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, సచిన్‌ టెండుల్కర్ దాదాకి విషెస్ చెప్పారు. అయితే మాజీ స్పిన్నర్, హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా సౌరవ్ గంగూలీకి శుభాకాంక్షలు వెల్లడించారు. ఇతరులను కూడా లీడర్లుగా తీర్చిదిద్దే […]

దాదా టీంలోకి హర్భజన్..! ట్వీట్ రిప్లై ఉద్దేశ్యం అదేనా..?
Follow us

| Edited By:

Updated on: Oct 17, 2019 | 2:59 AM

బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దేశ వ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెల్పుతున్నారు. అంతేకాదు.. ఆయన సహచర టీం మాజీ ప్లేయర్లు కూడా దాదాకి శుభాకాంక్షలు తెల్పుతూ.. వారి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే వీవీఎస్‌ లక్ష్మణ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, సచిన్‌ టెండుల్కర్ దాదాకి విషెస్ చెప్పారు. అయితే మాజీ స్పిన్నర్, హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా సౌరవ్ గంగూలీకి శుభాకాంక్షలు వెల్లడించారు.

ఇతరులను కూడా లీడర్లుగా తీర్చిదిద్దే సత్తా ఉన్నవారు మీరంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో మీకు నా శుభాకాంక్షలు అంటూ.. రాబోయే రోజులు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నాడు.

అయితే భజ్జీ ట్వీట్‌కు దాదా ధన్యవాదాలు తెల్పుతూ రీ ట్వీట్ చేశాడు. నీవు నా వెంటే ఉండాలంటూ కోరాడు. గతంలో టీమిండియాకు బౌలింగ్ చేసి ఎలా విజయాలు అందించావో.. అలాగే నాకు కూడా నీ సహకారం అందివ్వాలంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు దాదాను పొగుడుతూ.. ఇక భజ్జీని బీసీసీఐ బోర్డులోకి తీసుకునేలా ఉన్నారంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే గంగూలీ ఇచ్చిన రిట్వీట్ చూస్తే.. అవకాశం వస్తే.. భజ్జీని కూడా బోర్డులో చేర్చే అవకాశం ఉందేమో అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.