Sourav Ganguly: గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల.. దాదా ఆరోగ్యం నిలకడగా ఉందటున్న వైద్యులు..

Sourav Ganguly Health Update: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా..

Sourav Ganguly: గంగూలీ హెల్త్ బులెటిన్ విడుదల.. దాదా ఆరోగ్యం నిలకడగా ఉందటున్న వైద్యులు..
Follow us

|

Updated on: Jan 27, 2021 | 9:00 PM

Sourav Ganguly Health Update: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆసుపత్రి వర్గాలు దాదా ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. గంగూలీ ఈసీజీ రిపోర్టుల్లో స్వల్ప మార్పులు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఇక బుధవారం రాత్రి వైద్యులు రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం రెండో స్టెంటు వేసే అవకాశం ఉందని సమాచారం.  ఇదిలా ఉంటే.. ఇటీవల సౌరవ్ గంగూలీకి గుండెపోటు రావడంతో డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. దాని నుంచి పూర్తిగా కోలుకుని గంగూలీ జనవరి 7వ తేదీన వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‌అయితే తాజాగా బుధవారం.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన్ని కుటుంబీకులు హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

Also Read: Racial Abuse SCG: ”దోషులను గుర్తించలేకపోయాం”.. జాతి వివక్ష ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా వివరణ..!