Breaking News
  • కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నప్రధాని నరేంద్ర మోదీ . ఈ నెల 23న వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సీఎంలతో కోవిడ్‌-19 తాజా పరిస్థితుల గురించి చర్చ. ఈ భేటీలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నట్లు సమాచారం
  • శ్రీశైలం లో టెన్షన్: నిన్న మధ్యాహ్నం నాలుగు 15 గంటల సమయంలో దర్శనం కోసం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఆలయ శుద్ధి కోసం మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు ఆలయం మూసివేత. దర్శనం విషయంపై ఆర్ఎస్ఎస్ పోలీసులకు మధ్య వాగ్వాదం. చివరకు చేయి చేసుకునే పరిస్థితి చేరింది.. కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలింపు. కేంద్ర మంత్రి కిషన్ దృష్టికి తీసుకెళ్లిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఏపీ డీజీపీ కి ఫోన్ చేసిన కిషన్ రెడ్డి. పోలీస్ స్టేషన్ నుంచి తక్షణమే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విడుదల. నలుగురు సెక్యూరిటీ సిబ్బంది విధుల నుంచి తొలగింపు మరో ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్ లో తక్షణమే బదిలీ. విచారణ అధికారిగా ఆత్మకూరు డిఎస్పి వెంకట్రావు. ఇప్పటికే శ్రీశైలం చేరుకున్న డి.ఎస్.పి. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా శ్రీశైలం లోనే..... శ్రీశైలం లో కొంత టెన్షన్ వాతావరణం.
  • బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి కూకట్పల్లి కోర్ట్ షాక్. అమితాబ్ నటించిన జూండ్ సినిమా పై స్టే విధించిన కూకట్పల్లి కోర్ట్. జూండ్ సినిమా కాపీ రైట్స్ విషయంలో కూకట్పల్లి కోర్ట్ ను ఆశ్రయించిన నంది చిన్ని కుమార్ . ఫుట్బాల్ ప్లేయర్ అఖిలేష్ పౌల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న జూండ్ . అఖిలేష్ పౌల్ నుండి కాపీ రైట్స్ తీసుకున్న నంది చిన్ని కుమార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర లో నటిస్తున్న జూండ్ కాపీ రైట్స్ తనవి అంటూ కూకట్పల్లి కోర్ట్ ను ఆశ్రయించిన చిన్ని కుమార్. వాదనలు విన్న కూకట్పల్లి కోర్ట్ . సినిమా ను ఓటిటి లో విదుడల కాకుండా స్టే విధింపు.
  • ఏఎన్నార్‌ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్‌ చేసిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్. అఖిల్‌ కెరీర్‌లో ఐదో సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్. సురేందర్‌ రెడ్డి డైరక్షన్‌ చేస్తున్న సినిమా ఇది . తాతగారు ఎప్పుడూ దేవుడిని నమ్మే వారు కాదన్న అఖిల్‌. ఆయన అభిమానుల్లో దేవుడిని చూసుకునేవారన్న అఖిల్‌.
  • . భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. . 54 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 1133 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 94,612 • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 54,00,620 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,10,824 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,03,043 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 86,752 . దేశంలో 79.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 19.10 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.61 శాతానికి తగ్గిన మరణాల రేటు . దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 12,06,806 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు . దేశంలో ఇప్పటి వరకు 6,36,61,060 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • రెండు వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమైనవి. రైతుల జీవితాల్లో మార్పు తెస్తాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్. వ్యవసాయ బిల్లులు కనీస మద్దతు ధరతో సంబంధం లేదని రైతులకు భరోసా ఇస్తున్నా. నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి.

కిల్‌ ‘లేడీ’..చంపడమే హాబీ..ట్విస్టుల మీద ట్విస్టులు…

Unravelling the mysterious Kerala cyanide murders, కిల్‌ ‘లేడీ’..చంపడమే హాబీ..ట్విస్టుల మీద ట్విస్టులు…

పద్నాలుగేళ్ల వ్యవధిలో ఆరు హత్యలకు పాల్పడిన  సైకో సీరియల్ కిల్లర్ వ్యవహారం తెలిసిందే. ఆస్తి కోసం సైనేడ్ ను మటన్ సూప్ లో కలిపేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురిని చంపేసిన జాలీ వ్యవహారంలో కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ లోక్ నాథ్ బెహ్రా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాగా ఇలా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీనే రంగంలోకి దిగడం..చాలా అరుదనే చెప్పాలి.

జాలీ షాజు (47) అనే మహిళ 2002 నుంచి 2014 మధ్య తన మొదటి భర్తను, అతడి తల్లిదండ్రులను, తన రెండో భర్త మాజీ భార్యను, మరో ఇద్దరిని విషం పెట్టి చంపినట్లు అంగీకరించిందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె 2014లో ఒక చిన్నారిని కూడా చంపినట్లు చెప్తున్నారు.జాలీ షాజుతో పాటు, ఆమెకు సాయం చేశారన్న ఆరోపణలతో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయగా.. అక్టోబర్ 16వ తేదీ వరకూ ముగ్గురినీ రిమాండ్‌కు పంపించారు. నిందితుల్లో ప్రాజీకుమార్ అనే స్వర్ణకారుడు ఆమెకు సైనేడ్ సరఫరా చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే తనపై ఆరోపణలన్నీ అవాస్తవమని తాను నిర్దోషినని అతడు చెప్పినట్లు సమాచారం. ఎలుకలకు విషం పెట్టటానికి జాలీ తన దగ్గర సైనేడ్ కొన్నదని తాను భావించినట్లు అతడు పేర్కొన్నాడు.

ఎన్నో అనుమానాలు..ఎప్పుడు వీడతాయి చిక్కుముళ్లు:

జాలీ మొదటి భర్త రాయ్ థామస్ 2011లో చనిపోయారు. అతడి సోదరుడు రోజో థామస్ రెండు నెలల కిందట అధికారులను కలిసి తన అనుమానాలు వ్యక్తం చేయటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కాగా అనుమానాలు ఉంటే..అతడు ఇప్పటివరకు ఎందుకు పిర్యాదు చేయలేదని క్వచ్చన్స్ రైజ్ అవుతున్నాయి

జాలీ షాజు మొదటిగా 2002లో తన మొదటి అత్త అన్నమ్మ థామస్‌ను భోజనంలో విషం పెట్టి చంపిందని ఆరోపణ. ఆరేళ్ల తర్వాత జాలీ మొదటి మామ టామ్ థామస్ (66) కూడా అదే పరిస్థితుల్లో చనిపోయారు. ఆ తర్వాత 2011లో జాలీ మొదటి భర్త రాయ్ థామస్ చనిపోయారు. మృతదేహానికి నిర్వహించిన శవపరీక్షలో సైనేడ్ ఆనవాళ్లను గుర్తించారు. కానీ దాని మీద దర్యాప్తు చేయలేదు.

అయితే.. తన మేనల్లుడి మృతదేహానికి రెండోసారి శవపరీక్ష జరపాలని 2014లో అన్నమ్మ సోదరుడు మాథ్యూ పట్టుపట్టారు. ఆయన అదే ఏడాది  చనిపోవడం చర్చనీయాంశం అయింది.  2016లో రాయ్ థామస్‌కి సోదరుడు వరస అయ్యే స్కారియా షాజు భార్య చనిపోవటంతో ఆ కుటుంబంలో ఆందోళన పెరిగింది. రెండేళ్ల తర్వాత 2018లో స్కారియా షాజు కూతురు ఆల్ఫైన్ కూడా చనిపోయింది.

Unravelling the mysterious Kerala cyanide murders, కిల్‌ ‘లేడీ’..చంపడమే హాబీ..ట్విస్టుల మీద ట్విస్టులు…

అనంతరం స్కారియా షాజును జాలీ పెళ్లి చేసుకుంది. ఈ ఆరుగురినీ తాను విషం పెట్టి హత్య చేసినట్లు జాలీ షాజు అంగీకరించిందని పోలీసులు చెప్తున్నారు. ఇందుకు కారణం డబ్బులేనని పేర్కొన్నారు. తన తల్లి మరణం తర్వాత కుటుంబ ఆర్థిక వ్యవహారాలను జాలీ షాజు తన చేతుల్లోకి తీసుకుందని ఆమె ఆడపడుచు రెంజీ చెప్పారు. జాలీని ఆదర్శవంతమైన కోడలని తన తండ్రి భావించేవారని కూడా ఆమె చెప్పడం గమనార్హం.

ఒక్కోక్కరిని ఒక్కోలా: 

జాలీ ఫ్మామిలీ మెంబర్స్‌‌ని చంపేందుకు ఒక్కొక్కరి ఒక్కో ఐటమ్‌ని ఎంచుకుంది. అత్తకు మటన్ సూప్‌లో…మామయ్యకు కాఫీలో సైనేడ్ కలిపి ఇచ్చింది. ఇలా ఒక్కొక్కరి ఒక్కో పానియంలో కలిపి పని పూర్తిచేసింది. మొదటి హత్యకు చివరి హత్యకు మధ్య పద్నాలుగేళ్ల గ్యాప్ ఉండటంతో హత్యలకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు కష్టమవుతుందని చెబుతున్నారు. చివరి హత్య జరిగి కూడా దాదాపు మూడేళ్లు కావటంతో.. నేరాన్ని నిరూపించటం అంత తేలికైన విషయం కాదంటున్నాయి అక్కడి పోలీసు వర్గాలు.

 జాలీ మానసిక పరిస్థితి ఏంటి? 

ఎప్పుడో పధ్నాలుగేళ్ల క్రితం వచ్చిన విక్రమ్‌ సినిమా అపరిచితుడు! చాలా పద్ధతిగా ఉండే లాయర్‌ రాము అపరిచితుడిలా మారి.. అవినీతిపరులకు గరుడ పురాణం ప్రకారం రకరకాలుగా మరణ శిక్షలు విధిస్తుంటాడు. ఆ విషయం తెలియని అతను… మళ్లీ రాము పాత్రలో ఒదిగిపోతుంటాడు. ఇది ‘స్ల్పిట్‌ పర్సనాలిటీ’ అనే రుగ్మత ఆధారంగా తీసిన సినిమా! సీరియల్‌ కిల్లర్‌ జాలీ జోసెఫ్‌ ఉదంతంతో అధికారులకు ఆ సినిమా గుర్తొస్తోంది. జూలీకి ‘స్ల్పిట్‌ పర్సనాలిటీ’ లక్షణాలు ఉన్నాయా అని అనుమానం కలుగుతోంది. అపరిచితుడు… అక్రమార్కులను మట్టుబెడితే, జాలీ ఆస్తి కోసం అయినవాళ్లు ఆరుగుర్ని సైనేడ్‌ పెట్టి చంపింది. విచారణలో భాగంగా పోలీసులు మానసిక నిపుణుల సహాయం తీసుకుంటున్నట్టు సమాచారం.
ఆడపిల్లలంటే పడదా? ఎందుకు?
జాలికి ఆడ పిల్లలంటే పడదట..!. ఇది ఎందుకో పోలీసులకు అర్టం కావడంలేదు. ఆమెకు మరిన్ని ప్రశ్నలు వేస్తుంది సిట్. భర్త సోదరి కుమార్తె ఆల్ఫాన్స్‌తో హత్యల సీరియల్ మొదలు పెట్టింది జాలి. అందరిని సైనేడ్‌తోనే చంపింది.

Related Tags