నా కుమారుడు అమాయకుడు.. దిశ గురించి ఏం తెలీదు: జరీనా వాకబ్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ మరణించిన ఆరు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సలైన్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే.

నా కుమారుడు అమాయకుడు.. దిశ గురించి ఏం తెలీదు: జరీనా వాకబ్‌
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 5:32 PM

Zarina Wahab about Sooraj: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ మరణించిన ఆరు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సలైన్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన విషయం తెలిసిందే. ఈ కేసులపై పోలీసులు విచారణ కొనసాగుతుండగా.. కొన్ని రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందులో నటుడు సూరజ్ పంచోలి పేరు బయటికి వచ్చింది.

సూరజ్‌, దిశ ఇద్దరు డేటింగ్ చేశారని.. దిశ గర్భం కూడా దాల్చిందని.. అయితే సూరజ్ అబార్షన్ చేయించుకోమని దిశకు చెప్పాడని.. ఈ విషయంలో దిశకు మద్దతుగా సుశాంత్ నిలిచాడని.. ఆ విషయంలోనే సల్మాన్, సుశాంత్‌ని హెచ్చరించడంతో పాటు పలు నిర్మాణ సంస్థల నుంచి తప్పించాడని పుకార్లు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు సూరజ్, దిశ ఫొటో(ఎడిట్ చేసింది) వైరల్‌గా మారడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. అయితే వీటిపై స్పందించిన సూరజ్‌.. తాను దిశను ఎప్పుడూ కలవలేదని, మాట్లాడలేదని అన్నారు.

ఇక తాజాగా ఈ పుకార్లపై సూరజ్ తల్లి, నటి జరీనా వాహిబ్‌ మాట్లాడారు. తన కుమారుడు అమాయకుడని, ఎలాంటి అబద్దాలు చెప్పడని ఆమె అన్నారు. కొంతమంది సూరజ్‌ని పంచింగ్ బ్యాగ్‌లాగా తయారు చేశారు. కారణాలు లేకపోయినా వివాదాల్లోకి అతడిని లాగుతున్నారు. సూరజ్ పార్టీ ఇచ్చాడన్న ఆరోపణలు అవాస్తవం. ఏదైనా షేర్ చేసేందుకు ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. దాని వలన అవతలి వారి పరువుకు భంగం కలుగుతుందని అన్నారు. కాగా దిశ, తనకు లింక్‌లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ నటుడు పునీత్ వశిష్ట మీద సూరజ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read More:

నాన్న ఆరోగ్యం విషమంగానే ఉంది.. ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియో

పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: జగన్