ఇక నగరంలోకి నీరా స్టాళ్లు..!

ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఔషధ గుణాలున్న నీరాను తెస్తామని ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే నీరా పాలసీని తెచ్చారు. అంతేకాదు.. ఈ రాష్ట్రంలో నీరా స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా త్వరలో హైదరాబాద్​ నగరంలో ఇవి అందుబాటులోకి రానున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతేకాదు నగరం చుట్టూ ఉన్న ఔటర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్డుపై కూడా ఈ నీరా స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు […]

ఇక నగరంలోకి నీరా స్టాళ్లు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 20, 2019 | 4:57 PM

ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఔషధ గుణాలున్న నీరాను తెస్తామని ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే నీరా పాలసీని తెచ్చారు. అంతేకాదు.. ఈ రాష్ట్రంలో నీరా స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా త్వరలో హైదరాబాద్​ నగరంలో ఇవి అందుబాటులోకి రానున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతేకాదు నగరం చుట్టూ ఉన్న ఔటర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్డుపై కూడా ఈ నీరా స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను కూడా మంత్రి ఇటీవలే విడుదల చేశారు. ఈ నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని.. దీనిని సేవించడం ద్వారా.. పలు ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయన్నారు. అయితే ఈ స్టాళ్లు కేవలం గౌడ కులస్థులకే కేటాయించనున్నారు. ఈ నీరా గీయడం, విక్రయం రెండూ కేవలం గౌడ కులస్తులే చేయాలని ఇంతకు ముందే సీఎం కేసీఆర్ సూచించారు.

అంతేకాదు.. ఈ స్టాళ్ల వద్ద.. ఎలాంటి ఫుడ్ పెట్టాలన్న దానిపై కూడా ఆలోచిస్తున్నారు. అన్ని విక్రయ కేంద్రాల వద్ద కేవలం తెలంగాణ వంటకాలను మాత్రమే ఎంకరేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్రక్రియను దశలవారీగా అన్ని జిల్లాల్లో ఈ నీరా స్టాళ్ల ఏర్పాటుతో పాటు.. ఉత్పత్తి, సరఫరాపై కూడా దృష్టి పెడతామన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..