సోనీ నుంచి స్మార్ట్ స్పీకర్.. విత్ వాటర్ ప్రూఫ్

సోనీ ఇండియా భారత్‌లోకి ఓ స్మార్ట్‌ స్పీకర్‌ను తీసుకొచ్చింది. ఎస్‌ఆర్‌ఎస్‌-ఎక్స్‌బీ402ఎం మోడల్‌ను సోమవారం ప్రవేశపెట్టింది. ఇందులో బ్లూటూత్ 4.2ను ఏర్పాటు చేశారు. ఈ స్పీకర్‌ను ఫోన్లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు వైఫై ద్వారా కూడా స్పీకర్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వాటర్, డస్ట్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్ ఫీచర్లను అందిస్తున్నారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 12 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. దీని ధర రూ.24,990గా నిర్ణయించారు. అయితే ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు బుకింగ్స్‌ చేసుకొంటే రూ.19,990కు ఈ స్పీకర్లను అందివ్వనున్నారు. దీంతోపాటు రూ.2,490 విలువ చేసే ఎడీఆర్‌-ఎక్స్‌బీ450ఏపీ హెడ్‌ఫోన్‌ ఉచితంగా లభిస్తుంది. అన్ని సోనీ బ్రాండ్‌ షాపుల్లో, ఈకామర్స్‌ పోర్టల్స్‌లో లభించనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *