లోనావాలాలో సోనూ సూద్ మైనపు బొమ్మ చూశారా..?

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వివిధ ప్రాంతాల‌లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను సొంత ఊర్ల‌కు పంపించేందుకు న‌టుడు సోనూ సూద్ న‌డుం బిగించిన సంగ‌తి తెలిసిందే.

లోనావాలాలో సోనూ సూద్ మైనపు బొమ్మ చూశారా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2020 | 7:06 PM

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వివిధ ప్రాంతాల‌లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను సొంత ఊర్ల‌కు పంపించేందుకు న‌టుడు సోనూ సూద్ న‌డుం బిగించిన సంగ‌తి తెలిసిందే. సొంత ఖ‌ర్చులు పెట్టుకుని మ‌రీ విమానాలు, స్పెష‌ల్ బ‌స్సుల ద్వారా వారిని స్వ‌స్థ‌లాల‌కు చేర్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న సినిమాల‌లో విల‌న్..రియ‌ల్ లైఫులో హీరో అంటూ ప్ర‌జ‌లు కీర్తించారు. ఆయన మానవత్వానికి నెటిజ‌న్లు స‌లాం కొట్టారు. ఆయ‌న ఇప్ప‌టికీ సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నారు.

కాగా ముంబాయిలోని లోనావాలాలో ఉన్న ఓ మ్యూజియంలో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఉంద‌ని సంగ‌తి మీకు తెలుసా?… ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందలూర్, పూనాకు ద‌గ్గ‌ర్లోని లోనావాలాలో 2010లో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. 2016 అక్టోబ‌ర్ 2న సోనూ త‌న మైనపు బొమ్మ‌ను స్వ‌యంగా ఆవిష్క‌రించారు. సోనూ విగ్రహాన్ని పూర్తి చేయడానికి కందలూర్ కు మూడు నెలలు స‌మయం ప‌ట్టింద‌ట‌. కాగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు, క్రీడాకారులు, క‌ళాకారులు, సినిమా స్టార్స్ మైన‌పు ప్ర‌తిమ‌లు అక్క‌డ కొలువ‌దీరాయి.