రియల్ హీరో మరో మంచి పని చేయబోతున్నాడు..

కొవిడ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.  సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు. ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వైద్య […]

రియల్ హీరో మరో మంచి పని చేయబోతున్నాడు..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 9:31 PM

కొవిడ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు.  సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకోబోతున్నారు. కొవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.. తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. గురువారం (జులై 30) తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్టు సోనూ సూద్ ప్రకటించారు.

ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు అందించనున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో సోనూ సూద్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించబోతున్నట్లుగా సోను సూద్ స్పష్టం చేశారు.

ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడుతున్నట్లు సోను సూద్ తెలిపారు. జులై 30న సోనూ సూద్ 47 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ రోజును తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని సోనూ సూద్ చూస్తున్నారు. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని ఆయన తెలిపారు.