వలస కార్మికుల పాలిట హీరో.. సోనూసూద్‌కు గవర్నర్‌, సీఎంల ప్రశంసలు..

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వలస కార్మికులకు అండగా నిలిచి.. నటుడు సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఆయన పలువురు

వలస కార్మికుల పాలిట హీరో.. సోనూసూద్‌కు గవర్నర్‌, సీఎంల ప్రశంసలు..
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 6:02 PM

కోవిద్-19 రోజురోజుకు విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ క్రమంలో వలస కార్మికులకు అండగా నిలిచి.. నటుడు సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకున్నారు. ఆయన పలువురు కార్మికుల్ని స్వస్థలాలకు పంపేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకున్న మహిళల్ని తమ సొంత రాష్ట్రం ఒడిశాకు పంపేందుకు సోనూసూద్‌ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు.

కాగా.. వలస కార్మికుల పాలిట రియల్ హీరో సోనూసూద్‌ను ముంబయిలోని రాజ్‌భవన్‌కు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కౌశ్యారీ ఆహ్వానించారు. వలస కార్మికులు క్షేమంగా ఇల్లు చేరేందుకు ఏర్పాట్లు చేసినందుకు అభినందించారు. ఇలాంటి మంచి పనులకు సాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. సోనూసూద్‌ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ కూడా మెచ్చుకున్నారు.

మరోవైపు.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ కు సోనూసూద్ రిప్లై ఇస్తూ.. ‘నన్ను మీ మాటలతో ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు సర్. కష్టాల్లో ఉన్న సోదరీమణుల్ని ఆదుకోవడం, వారిని ఇంటికి పంపడాన్ని బాధ్యతగా భావించా. దేశంలోని ఏ ప్రాంతంలో ప్రజలు చిక్కుకుని ఉన్నా నా వంతు సాయం చేస్తా’ అని పేర్కొన్నారు.

[svt-event date=”31/05/2020,6:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]