రాజీనామాకు సోనియా సిధ్ధం ? నిజం కాదంటున్న విధేయ వర్గం !

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసినట్టు చెబుతున్న లేఖ పెను దుమారాన్ని సృష్టించింది. నాయకత్వ మార్పుపై వీరంతా తమ లేఖలో..

రాజీనామాకు సోనియా సిధ్ధం ? నిజం కాదంటున్న విధేయ వర్గం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 5:38 PM

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసినట్టు చెబుతున్న లేఖ పెను దుమారాన్ని సృష్టించింది. నాయకత్వ మార్పుపై వీరంతా తమ లేఖలో అదేపనిగా పేర్కొన్నారని, పార్టీ అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందనడానికి ఇదే సంకేతమని అంటున్నారు. ఈ లేఖ పర్యవసానంగా సోనియా రాజీనామాకు సిధ్ధపడ్డారని, సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అసలు సోనియా ఆ లేఖ చూడలేదని ఆమె విధేయవర్గం చెబుతోంది. ఏమైనా..తాత్కాలిక అధ్యక్షురాలిగా తన ఏడాది కాలం పూర్తయిందని, పైగా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక పదవిలో కొనసాగలేనని సోనియా వ్యాఖ్యానించినట్టు కూడా తెలియవచ్చింది. కాగా- సీనియర్ నేతలు తమ లేఖలో ‘ఆత్మపరిశీలన’, ‘సమిష్టి నాయకత్వం’, ‘యువతకు ప్రాధాన్యం’ వంటి పదాలను ఎక్కువగా వాడినట్టు సమాచారం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని కూడా వారు కోరినట్టు తెలుస్తోంది.

రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు సూచిస్తున్నా..అయన ఇదివరకే ఇందుకు తన విముఖతను ప్రకటించిన విషయం గమనార్హం. పార్టీ నాయకత్వంలో మార్పును కోరుతూ 100 మంది పార్టీ నేతలు సోనియాకు లేఖ రాశారన్న మాజీ నేత సంజయ్ ఝా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను గత  నెలలో తొలగించిన సంగతి విదితమే. ఏమైనా ఆన్ లైన్ ద్వారా రేపు జరిగే సిడబ్ల్యుసీ సమావేశం..హాట్ హాట్ గా జరిగే సూచనలున్నాయి. ప్రధానంగా పార్టీ నాయకత్వ మార్పుపై కొంతమంది నేతలు రాసిన లేఖే మెయిన్ అజెండాగా ఉండవచ్చు.

ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
ఏపీలో చల్ల.. చల్లగా.! 3 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
శ్రీకృష్ణుడ్ని ఆరాధిస్తూ విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న యువతి..
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
చెన్నైకే కాదు, శాంసన్‌కు ఇచ్చిపడేసిన లక్నో సారథి
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
శనిలా దాపురించారు.. మీ ఆటకో దండం సామీ.. ఈ ప్లేయర్లు ఉన్న జట్లు.!
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.? ఇబ్బందులు తప్పవు
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
పుష్పరాజ్‏గా ఇరగదీసిన బుడ్డోడు.. చూస్తే గూస్ బంప్సే...
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఇదేం ఖర్మరా బాబూ.. గెలిచినోడికి, ఓడినోడికి కూడా నిరాశేనా..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
ఆమెతో సినిమా చేయడమే వేస్ట్.. ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు..
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
హైదరాబాద్​ ఎంపి అసదుద్దీన్​ ఓవైసీ నామినేషన్.. ఆస్తులు, ఆయుధాలివే
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
ఓట్స్‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.