Sonia tactics సలహాలిస్తూనే మెలిక పెట్టిన సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. కరోనా పాండమిక్ పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూనే ఆయన్ని ఇరుకున పెట్టే సలహాలతో లేఖ రాశారు సోనియా గాంధీ.

Sonia tactics సలహాలిస్తూనే మెలిక పెట్టిన సోనియా
Follow us

|

Updated on: Apr 07, 2020 | 4:54 PM

Sonia political gymmicks on Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. కరోనా పాండమిక్ పరిస్థితిని ఎదుర్కోవడంతో ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను సమర్థిస్తూనే ఆయన్ని ఇరుకున పెట్టే సలహాలతో లేఖ రాశారు సోనియా గాంధీ.

మంగళవారం సోనియాగాంధీ ప్రధానమంత్రికి లేఖ రాశారు. కరోనా నియంత్రణకు సూచనలిస్తున్నట్లుగానే లేఖలో పలు కీలకాంశాలను ప్రస్తావించారు. ఎంపీల వేతనాల్లో 30 కోత విధిస్తూ మోదీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు పలువురు, యుపీఏ భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తుంటే సోనియా మాత్రం స్వాగతించారు. వేతనాల్లో కోతను సమర్థించారు.

అదే సమయంలో సాధ్యం కాని సూచనలు చేసి మోదీని ఇరుకున్న పెట్టే రాజకీయ చతురతను ప్రదర్శించారు సోనియాగాంధీ. టీవీ, ప్రింట్, ఆన్‌లైన్ మాధ్యమాల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేయాలని సోనియా ప్రభుత్వానికి సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఇవ్వాలన్నారామె. 20 వేల కోట్ల రూపాయలతో తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిలిపివేయాలని సలహా ఇచ్చారు సోనియా.

బడ్జెట్‌లో 30 శాతం ఖర్చు తగ్గించి, తద్వారా వచ్చే రెండున్నర లక్షల కోట్ల రూపాయలను రైతులు, వలస కూలీలు, చిరు వ్యాపారులు వంటి నిరుపేద వర్గాల కోసం కేటాయించాలని సోనియా గాంధీ తన లేఖలో సూచించారు. ప్రధాని సహా మంత్రులు, అధికారుల విదేశీ యాత్రలు నిలిపివేయాలని సలహా ఇచ్చారామె.

కరోనా సిచ్యుయేషన్‌నిన ఎదుర్కొనేందుకు మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ ఫండ్‌కు వచ్చిన నిధులన్నీ.. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కి బదిలీ చేయాలని సోనియా సజెస్ట్ చేశారు. మోదీ మార్కు రాజకీయంలో ఈ అంశాలు చాలా కీలకమని తెలిసిన సోనియా గాంధీ.. వాటినెలాగో మోదీ పక్కనపెట్టలేరన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా ఆమె ఈ సలహాలను మోదీ ముందుంచారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..