సోనియా వ్యూహం.. యూపీఏ ఏర్పాటుకై ‘తటస్థ’ పార్టీలకు ఆహ్వానం

ఈ నెల 19తో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఆ తరువాత మరో నాలుగు రోజులకు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో కొన్ని ఎన్డీయేనే మళ్లీ అధికారాన్ని చేపడుతుందని చెప్పినప్పటికీ.. మరికొన్ని మాత్రం హంగ్ ఖాయమంటూ తేల్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ యాక్టివ్ అయ్యారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతోన్న ఆమె.. ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న సమావేశాన్ని నిర్వహించబోతున్నారు సోనియా.

ఇక ఈ భేటీకి ఎన్డీయేతర పక్షాలను రావాల్సిందిగా సోనియా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అందులో బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీకి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఫలితాలు వచ్చిన వెంటనే తటస్థ పార్టీలను యూపీఏలోకి తెచ్చి.. తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సోనియా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా వివిధ ప్రాంతీయ పార్టీలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *