తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరన్నారు. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో […]

తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా
Follow us

|

Updated on: Aug 29, 2020 | 9:22 PM

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరన్నారు. భారత ప్రజలు, మన గిరిజనులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలు నోరెత్తకుండా ఉండాలని కోరుకుంటున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని.. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరుతున్నాయని.. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో నూతన అసెంబ్లీ భవన శంకుస్థాపన సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా సోనియా గాంధీ హిందీలో ప్రసంగించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, తన ప్రసంగంలో సోనియా ఎక్కడా అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండానే మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టడం విశేషం.